»   » మోసం చేసాడంటూ..హీరోయిన్ సంజన ఛీటింగ్ కేసు

మోసం చేసాడంటూ..హీరోయిన్ సంజన ఛీటింగ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjana
బెంగళూరు : ఈ మధ్య కాలంలో సంజనకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా స్నేహితునిగా ఉంటూనే రాజీవ్‌ అనే వ్యక్తి తనను రూ.13లక్షల మేర వంచించాడని అశోకనగర పోలీసులకు నటి సంజన ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ధర్యాప్తు మొదలెట్టారు. త్వరలోనే ఓ కొలిక్కి తెస్తామని చెప్తున్నారు.

పోలీసుల కథనం మేరకు రాజీవ్‌ తన నుంచి రూ.13లక్షలు తీసుకుని తప్పించుకు తిరగటం మొదలుపెట్టాడు. ఫోన్‌లో ఆమె పలుమార్లు విజ్ఞప్తి చేయటంతో చివరకు ఒక బ్యాంకు చెక్కును ఇచ్చాడు. ఎన్నిమార్లు బ్యాంకులో జమ చేసినా అది చెల్లక పోవడంతో రాజీవ్‌ తనను వంచించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశోకనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంజనకు ఆ మధ్యన సినిమా నిర్మాతల నుండి కూడా లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. తన కోరిక తీర్చమంటూ వేధించిన ఓ నిర్మాత బండారం సంజన బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'సరదా' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వన్స్ ఎపానె టైం అనే మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కమిటైంది.

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

అయితే కన్నడ సినిమాల్లో అమ్మడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. అక్కడ కూడా కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుండటంతో అవకాశాలు అడపాదడపాగానే రావడం మొదలపెట్టాయి. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేక పోవడంతో కన్నడలో ప్రారంభమైన బిగ్ బాస్ షోలో పాల్గొంటోంది.

English summary
Actress Sanjana filed a complaint against his friend Rajeev claiming her payments of debts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu