ఉదయం లేవగానే డ్రగ్స్ కోసం తపించేవాడు: స్టార్ హీరోపై దర్శకుడి సంచలనం!
బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా తన హవా కొనసాగించిన వారిలో సంజయ్ దత్ ఒకరు. ప్రస్తుతం భార్య మాన్యత దత్, ఇద్దరు పిల్లలతో ఆయన జీవితం చూడటానికి చాలా సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తోంది కానీ..... సంజయ్ గత జీవితంలో చీకటి కోణాలు ఎన్నో. అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ జైలు శిక్ష సైతం అనుభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ దత్ గురించి ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సంచలన విషయాలు బయట పెట్టారు.

డ్రగ్స్‌కు బానిసయ్యాడు
గతంలో సంజయ్ దత్ హెరాయిన్ అనే డ్రగ్‌కు బానిసయ్యాడని, ఆ సమయంలో సంజయ్ దత్ చాలా కష్టకాలం ఎదుర్కొన్నాడని మహేష్ భట్ వెల్లడించారు.

ఉదయం లేవగానే తపించేవాడు
హెరాయిన్‌కు బానిసైన రోజుల్లో సంజచ్ దత్ ఉదయం లేవగానే ఆయన మొదటి ఆలోచన హెరాయిన్ గురించే ఉండేది. అది తీసుకునే వరకు స్థిమితంగా ఉండేవాడు కాదు.... అని మహేష్ భట్ తెలిపారు.

రేడియో షోలో డ్రగ్స్ ప్రస్తావన
మహేష్ భట్, పూజా భట్ కలిసి ‘భట్ నాచురల్లీ' పేరుతో ఓ రేడియో షోలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ ప్రస్తావన రాగా...... ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇద్దరూ కలిసి నిర్మాతలుగా
మహేశ్ భట్, సంజయ్‌దత్‌లు కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్ పేరుతో కబ్జా, సడక్, దుష్మన్ వంటి చిత్రాలను నిర్మించారు.

రణబీర్ కపూర్ కూడా
తాను గతంలో డ్రగ్స్ వాడానని అంగీకరించాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్. చదువుకునే రోజుల్లో తనకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, చిన్న వయసులోనే తాను డ్రగ్స్‌కు బానిస అయ్యానని తెలిపారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మారిపోయిన రణబీర్
ఇపుడు మారాను డ్రగ్స్ కారణంగా తన జీవితం నాశనం అయ్యే పరిస్థితుల్లో ఇంట్లో వారు, స్నేహితులు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో అవి వాడటం ఎంత తప్పో తెలుసుకుని పూర్తిగా మానేశానని రణబీర్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో సీన్ కోసం డ్రగ్స్ వాడాను
డ్రగ్స్ మానేసిన తర్వాత ఓ సారి సినిమా షూటింగులో సీన్ పండేందుకు చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్లు రణబీర్ కపూర్ తెలిపారు. ‘రాక్‌స్టార్' సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం కోసం డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించాడు.

ఒత్తిడి భరించలేకేనా?
సినిమా స్టార్స్ కావాల్సినంత డబ్బు, పేరు పలుకుబడితో చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తారు. అయితే వారిపై రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. పని ఒత్తిడి, కెరీర్ పరమైన సమస్యలు, సినిమా హిట్టు ప్లాపుల ఎఫెక్ట్ ఇలా చాలా ఉంటాయి. ఆ ఒత్తిడి భరించలేకే కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటారని టాక్.

ఫర్దీన్ ఖాన్
బాలీవుడ్లో డ్రగ్స్ వ్యసనానికి బానిసైన వారిలో ఫర్దీన్ ఖాన్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ నటుడు డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు కూడా.


Click it and Unblock the Notifications











