»   » బూట్లలో హెరాయిన్ దాచుకొని ప్రయణించాను, స్కూల్ వయసులో డ్రగ్స్: స్టార్ హీరో గతం ఇదీ

బూట్లలో హెరాయిన్ దాచుకొని ప్రయణించాను, స్కూల్ వయసులో డ్రగ్స్: స్టార్ హీరో గతం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గడిచిన కొద్దికాలంగా డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్కూల్ పిల్లల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ హైదరాబాద్ మహానగరంలో మొత్తంగా వ్యాపించిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు భారీ కలకలాన్నే రేపుతోంది. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఇంతగా జోగుతుందా? అన్న సందేహం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయితే ఇక్కడ టాలీవుడ్ లో ఇలాంటి న్యూస్ కొత్తదేమో గానీ బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది. దాదాపు ఇరవయ్యేళ్ళకంటే ముందే బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ డ్రగ్స్ వలలో పడ్డాడు.

డ్రగ్స్‌కి బానిసగా మారి

డ్రగ్స్‌కి బానిసగా మారి

బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ ఒకప్పుడు డ్రగ్స్‌కి ఎడిక్ట్‌. డ్రగ్స్‌కి బానిసగా మారి, కెరీర్‌ని నాశనం చేసుకున్నాడు. ఆ డ్రగ్స్‌ పుణ్యమా అని మాఫియాతో లింకులేర్పడ్డాయి. అవి కాస్తా టెర్రరిస్టులకు అనుకూలంగా మారాయి. ఫలితం, 'టాడా' చట్టం కింద బుక్కయి, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

నాలా మరొకరు కాకూడదు

నాలా మరొకరు కాకూడదు

సంజయ్‌ దత్‌ జీవితం ఎవరికైనా గుణపాఠమేనని ఇంకెవరో కాదు, స్వయంగా సంజయ్‌దత్‌ చెప్పుకున్నాడు కూడా. డ్రగ్స్‌ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయని సంజయ్‌దత్‌ చెబుతుండేవాడు.‘డ్రగ్స్‌కి బానిసైన నేను ఆ బానిసపు సంకెళ్లు తెంచుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నాలా మరొకరు కాకూడదు అని కోరుకుంటున్నాను' అంటూ ఒక పత్రికకి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఒకసారి చెప్పాడు సంజయ్. తన బూట్లలో కిలో హెరాయిన్ ని దాచుకొని మరీ ప్రయాణించానని చెప్పటం మరీ సంచలనం అయ్యింది.

స్కూలుకు వెళ్లే రోజుల్లోనే

స్కూలుకు వెళ్లే రోజుల్లోనే

ప్రస్తుతం 58 ఏళ్ల సంజయ్.. 22 ఏళ్ల వయసులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1981లో ఆయన నటించిన రాకీ మూవీతో హీరోగా ఎంటర్ అయిన సంజయ్.. వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదంగా ఉండేది. స్కూలుకు వెళ్లే రోజుల్లోనే సంజయ్ డ్రగ్స్ తీసుకునేవాడని చెబుతారు.

తల్లి నర్గీస్ చనిపోయిన తర్వాత

తల్లి నర్గీస్ చనిపోయిన తర్వాత

1981లో తన తల్లి.. ప్రముఖ నటి నర్గీస్ చనిపోయిన తర్వాత సంజయ్ డ్రగ్స్ కి మరింతగా అలవాటు పడ్డాడని చెబుతారు. 1982లో డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న నేరం మీద ఐదు నెలలు జైలుశిక్ష అనుభవించాడు సంజయ్. ఈనేపథ్యంలో సినీ నటుడు కమ్ పొలిటీషియన్ అయిన సునీల్ దత్.. తన కొడుకును డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించేందుకు యూఎస్ కు పంపి మరీ ప్రత్యేకంగా చికిత్స చేయించారు.

బయోపిక్ లో

బయోపిక్ లో

మూడేళ్ల తర్వాత తిరిగి 1985లో జాన్ కీ బాజీ చిత్రంలో నటించటం ద్వారా సినిమాల్లో తన ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించాడు. ఇప్పుడు సంజయ్ పై రాబోతున బయోపిక్ లో సంజయ్ దత్ మాదక ద్రవ్యాలకు ఎలా బానిసయ్యాడు, జైలు కెళ్లిన రోజులు, తల్లి నర్గీస్ దత్ చనిపోయినపుడు ఎలా కుమిలిపోయాడు? అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. . సంజయ్ దత్ జీవితంలో ఎన్నో వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఆయనను అభిమానులు ఇప్పటికీ ఇష్టపడుతున్నారని ఈ సినిమాలో సంజయ్ గా కనిపించ బోతున్న రణ్ బీర్ చెప్పాడు.

English summary
I was so addicted that once I travelled with 1 kilogram of heroin hidden in my shoes said Sajay Dutt
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu