»   » తన గర్లఫ్రెండ్ తో ఎఫైర్ ఉందని ఆ హీరో కొట్టడానికి వస్తే, భార్యే కాపాడింది

తన గర్లఫ్రెండ్ తో ఎఫైర్ ఉందని ఆ హీరో కొట్టడానికి వస్తే, భార్యే కాపాడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కరణ్ జోహార్ లాగే..బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ రోజూకో బాంబు పేలుస్తున్నాడు. 64 యేళ్ల ఈ పాతతరం 'ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్' పేరుతో తన స్వీయ జీవితచరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ పుస్తకంలోలో తన తండ్రి రాజ్‌ కపూర్‌ రాసలీలలు, తన చిన్ననాటి అనుభవాలు, తనకొచ్చిన పేరు ప్రతిష్టలు, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించాడు. అంతేనా.. మాఫియాడాన్ దావూద్‌ ఇబ్రహీంతో రెండుసార్లు కలిసిన సందర్భంగా అనుభవాలను కూడా విపులీకరించారు.

ఇప్పుడు హీరోయిన్లతో తనకు ఎఫైర్స్ ఉన్నట్టు రూమర్స్ రావడం, వాటిపై భార్య నీతు స్పందన గురించి ఈ పుస్తకంలో రాశారు. ముఖ్యంగా సంజయ్ దత్ తనను కొట్టడానికి వచ్చాడని, అయితే తన భార్య మొత్తం సెటిల్ చేసిందని చెప్పారు.

అపార్దం చేసుకున్నారు

అపార్దం చేసుకున్నారు

అప్పట్లో మీడియ ఇంత ఫాస్ట్ గా లేకపోవడం..ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసి చాలా మంది అపార్థం చేసుకున్నారని ముఖ్యంగా టీనా మునిమ్ తో సంజయ్ దత్ అంటే ఇష్టపడేదని..కానీ ఈ ఎఫైర్ల గురించి తెలుసుకున్న సంజయ్ .. గుల్షన్ గ్రోవర్‌తో కలిసి తనతో గొడవపడటానికి నీతూ ఇంటికి సంజయ్ దత్ వచ్చాడని పేర్కొన్నారు.

గొడవ పడటానికే..

గొడవ పడటానికే..

కానీ మీడియా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని, కానీ కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం తనకు టీనాతో సీక్రెట్‌ ఎఫైర్ ఉందని భావించేవారని తెలిపారు. ఈ విషయం తెలియగానే ఓ రోజు సంజయ్‌ దత్‌, గుల్షన్ గ్రోవర్‌ తో కలసి తనతో గొడవ పడటానికి నీతూ ఇంటికి వచ్చారని వివరించారు. ఇద్దరి మధ్య గొడవ కాకుండా నీతూ పరిష్కారం చేసిందని వెల్లడించారు.

కేవలం అవి రూమర్సే

కేవలం అవి రూమర్సే

తనకు, టీనాకు మధ్య ఎపైర్‌ లేదని, ఈ పుకార్లు నిరాధారమని, కేవలం కో స్టార్‌ లుగా స్నేహంగా ఉంటారని.. సంజయ్‌ కు నీతూ చెప్పి నమ్మించడంతో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రస్తావన వచ్చినపుడు తాను, సంజయ్‌ నవ్వుకునేవాళ్లమని తెలిపారు.

వివాహం చేసుకున్నా..

వివాహం చేసుకున్నా..

ఈ సంఘటన జరిగాక నీతూ, తాను వివాహం చేసుకున్నామని, తమ పెళ్లికి తన హీరోయిన్లు అందరూ వచ్చారని వెల్లడించారు. సంజయ్ దత్ కూడా వివాహానికి వచ్చారని తెలియచేసారు. సినీ పరిశ్రమలో ఇలా రూమర్స్ రావటాలు కామన్ అని, అర్దం చేసుకునే భార్య ఉంటే వాటితో పెద్ద సమస్య రాదని ఆయన వ్యాఖ్యానించారు.

డింపులోనూ ఎఫైర్

డింపులోనూ ఎఫైర్

పెళ్లయిన తర్వాత డింపుల్‌ కపాడియాతో తనకు ఎఫైర్‌ ఉందని పుకార్లు వచ్చాయని రిషి కపూర్‌ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకముందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్‌ తనకు స్నేహితురాలు మాత్రమేనని పేర్కొన్నారు. తామిద్దరం బాబీ సినిమాలో నటించామని, తర్వాత సాగర్‌ సినిమా చేశామని తెలిపారు.

మీడియా రాధ్దాంతమే

మీడియా రాధ్దాంతమే

మొత్తానికి తనకూ, టీనా కు ఎలాంటి ఎఫైర్ లేదని కేవలం కో స్టార్ కావడం వల్ల సన్నిహితంగా ఉంటున్నామని ఈ విషయాన్ని అప్పట్లో తప్పుగా చూపించి ప్రింట్ మీడియా చేసిన రాద్దాంతం అని సంజయ్‌కు నీతూ వివరించిందని గుర్తు చేసుకున్నారు.

మా నాన్నకు అవే లోకం

మా నాన్నకు అవే లోకం

అలాగే తన తండ్రి అయిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజ్‌ కపూర్‌ గురించి కూడా రిషీ కపూర్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సినిమాలు, మద్యం, హీరోయిన్స్.. ఇవే తన తండ్రిలోకమని వెల్లడించాడు. నర్గీస్‌, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్టు ఆ పుస్తకంలో రిషి కపూర్ వివరించారు.

ఓ గురువు కూడా

ఓ గురువు కూడా

నాకైతే రాజ్ కపూర్ ఓ తండ్రి మాత్రమే కాదు ఆయన నా గురువు. ఈ రోజు నేనీ స్థితిలో ఉన్నానంటే ఆయన వల్లే. పిల్లలముగా ఉన్నప్పుడు మేము ఒక గొప్ప వ్యక్తి సంతానమని భావించేవాళ్లం. ఎందుకంటే అంతా మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తుండేవారు. నేనెప్పుడూ నా తండ్రితో వాదించలేదు అన్నారు రిషీ కపూర్.

నా కొడకు గాళ్ ఫ్రెండ్స్

నా కొడకు గాళ్ ఫ్రెండ్స్

దురదృష్టవశాత్తూ నాన్నకు నాకు మధ్య ఉన్నటువంటి బంధమే రణ్ బీర్ కూ బదిలీ అయింది. మా మధ్య ప్రేమ, గౌరవం ఉండాలని ఆశించా. కానీ నేను రణ్ బీర్ ను అతడి గాళ్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ చెప్పమని అడిగే టైప్ కాదు. నేను అతడిని చూడగలగాలి, కానీ అతడిలా ఫీలవకూడదని అనుకున్నా" అని చెప్పుకొచ్చారు రిషి.

ఖచ్చితంగా అలా ఉండడు

ఖచ్చితంగా అలా ఉండడు

తరాల అంతరాన్ని ప్రస్తావించిన రిషి రణ్ బీర్ ఆశించిన తండ్రిలా ఉండలేకపోయానని అన్నారు. "తన పిల్లలతో రణ్ బీర్..నాలా వ్యవహరించడు. అదే జనరేషన్ గ్యాప్. నేను నా కుమారుడితో ఓ స్నేహితుడిలా ఉండలేకపోయా. నువ్వు నన్ను నన్నుగా అంగీకరించాల్సిందే" అంటూ కుమారుడు రణ్ బీర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రిషి కపూర్.

English summary
Rishi Kapoor has revealed many unknown secrets from his life in his autobiography: Khullam Khulla.Read about the interesting incident from Rishi Kapoor's life when actor Sanjay Dutt thought that Rishi was having an affair with his then girlfriend Tina Munim.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu