»   » ఆ సినిమా పై ఇప్పటికీ ఆగని దాడులు : షూటింగ్ జరిగే సెట్‌ తగల బెట్టారు

ఆ సినిమా పై ఇప్పటికీ ఆగని దాడులు : షూటింగ్ జరిగే సెట్‌ తగల బెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పద్మావతి'.రణ్‌వీర్ సింగ్, దీపికాపదుకొనే, షాహిద్‌కపూర్ కాంబినేషన్‌లో పద్మావతి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపించనుండగా, దీపికాదుకొనే రాణి పద్మావతి పాత్రలో, షాహిద్ కపూర్ రతన్‌సింగ్ పాత్రలో నటిస్తున్నారు. దిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దిన్‌ ఖిల్జీ.. చిత్తోడ్‌ మహారాణి పద్మినిని ప్రేమించిన కథ నేపథ్యంలో భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని జైగడ్‌ కోటలో జరుగుతుండగా కర్ణిసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేసారు. ఆ తర్వాత కూడా ఆ దర్శకుడి మీదా సినిమా మీదా దాడులు ఆగటం లేదు... తాజాగా మళ్ళీ ఇంకో దాడి జరిగింది....

  కర్ణిసేన కార్యకర్తలు

  కర్ణిసేన కార్యకర్తలు

  పద్మావతి చిత్రంలో చారిత్రాత్మక అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన కర్ణిసేన కార్యకర్తలు..జైగఢ్ కోట వద్ద జరుగుతున్న షూటింగ్‌ను అడ్డుకున్నారు. రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.సంజయ్‌లీలా బన్సాలీ ని చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు.

   జైగఢ్ కోట వద్ద

  జైగఢ్ కోట వద్ద

  ఘటన జైగఢ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీమ్ మొత్తం షాక్‌కు గురైంది. సినిమాలో రాజ్‌పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటన పై బాలీవుడ్ నుంచి కూదా పెద్ద స్థాయిలోనే నిరసన చెలరేగింది. ఒక దర్శకున్ని అంత పాశవికంగా కొట్టటం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తప్పుపట్టారు.

  బన్సాలీకి మద్దతుగా

  బన్సాలీకి మద్దతుగా

  ట్విటర్ మొత్తం సినీ ప్రముఖుల ట్వీట్లతో నిండిపోయింది. సంజయ్ లీలాబన్సాలీకి మద్దతుగా తామంతా ఉన్నామని బాలివుడ్ మొత్తం ఏక కంఠం తో సంజయ్ కి బరోసా నిచ్చింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడ దాడికి పాల్పడ్డ రాజ్‌పుత్ సేన మాత్రం తమ చర్యలు సరైనవేనంటూ సమర్థించుకుంది.

  బన్సాలీపై దాడి సబబే

  బన్సాలీపై దాడి సబబే

  బన్సాలీపై దాడి సబబేనని, ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలేనని పేర్కొంది. బన్సాలీపై దాడి విషయంలో జరుగుతున్న రాద్ధాంతంపై రాజ్‌పుత్ కర్ణిసేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. సంజయ్‌కు చరిత్రను వక్రీకరించి సినిమా తీయడమే, ఆయనకు ఎంత దమ్ముంటే తమ గడ్డపై తమ చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

   రాణి పద్మినిని అగౌరవపరిచేలా

  రాణి పద్మినిని అగౌరవపరిచేలా

  జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఆయన సినిమా తీయగలడా? అని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నేలేదన్నారు. 'పద్మావతి' సినిమాలో రాజ్‌పుట్‌ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

  జోధాబాయి చరిత్ర

  జోధాబాయి చరిత్ర

  గతంలో ఆయన తెసిన 'జోధా అక్బర్'లోనూ జోధాబాయి చరిత్రను కూడా ఇలాగే వక్రీకరించాడనీ అందుకే అతను చేసిన, చేస్తున్న తప్పులకి శిక్ష విధించాలనీ, ఆయనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్టు లోకేంద్ర వివరించారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది.

  మరో ఎటాక్

  మరో ఎటాక్

  రాజ్‌పుత్‌ సేన కు చెందిన కర్ణిసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి మరవక ముందే ఇదే బ్యాచ్ మరో ఎటాక్ కు దిగారు. రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక చిత్తోడ్‌గఢ్‌ కోటపై కర్ణి సేన అనే బ్యాచ్ కి చెందిన ఆందోళనకారులు దాడి చేశారు. కోటలోని రాణి పద్మిని మహల్‌లో ఉన్న అద్దాలను పగలగొట్టారు. కోటలోని అద్దాలు చరిత్రను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. వాటిని తొలగించాలని తాము అనేక సార్లు హెచ్చరించామని కర్ణి సేన బృందం తెలిపింది. కోట నిర్వాహకులు అద్దాలను తొలగించకపోవడంతో తాము దాడి చేసినట్లు పేర్కొంది.

  సినిమా సెట్‌ని తగలబెట్టేశారు

  సినిమా సెట్‌ని తగలబెట్టేశారు

  తాజాగా, మరోమారు 'పద్మావతి' సినిమా యూనిట్‌పై దాడి జరిగింది. ఈసారి సినిమా సెట్‌ని తగలబెట్టేశారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఈ సెట్ రూపొందించారట. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ 'పద్మావతి' సినిమాని పూర్తి కానివ్వబోమనీ, ఎలాగోలా సినిమాని పూర్తి చెయ్యాలనుకుంటే, థియేటర్లను సైతం తగలబెట్టేస్తామంటూ రాజ్‌పుట్‌ కర్ణి సేన హెచ్చరిస్తోంది. గతంలో ‘పద్మావతి‘పై దాడి జరిగింది జైపూర్ లో. ఇప్పుడు దాడి మహారాష్ట్రలో సినిమా సెట్ తగలబడింది.

  ముందస్తు దాడి

  ముందస్తు దాడి

  మరోపక్క, సినిమాలో ఏముందో తెలియకుండా, సినిమాపై ముందస్తు దాడి ఎంతవరకు సమంజసం.? అని ప్రశ్నిస్తున్నాడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయనకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

  చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని

  చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని

  పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

  English summary
  According to reports, the local goons attacked the Padmavathi set and burnt it to ground at 10 pm last night, when the shooting was almost over. all the shooting equipment and the entire set up was damaged in this incident.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more