»   » హోంమంత్రి రాజీనామా చేయాలి.. ప్రభుత్వం బాధ్యత వహించాలి.

హోంమంత్రి రాజీనామా చేయాలి.. ప్రభుత్వం బాధ్యత వహించాలి.

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై జరిగిన దాడి ఘటనపై ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తీవ్రంగా స్పందించారు. భన్సాలీపై దాడి జరిపిన గుండాలకు మద్దతు తెలిపిన రాజస్థాన్ హోం మంత్రిపై మండిపడ్డారు.

Sanjay leela bhansali attack: Rajasthan Home minister should resign, Mahesh Bhatt demand

అసాంఘిక శక్తుల దాడిని నిలువరించడంలో ప్రభుత్వ విఫలమైందని, అందుకు హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తన బాధ్యతేంటో తెలుసుకోలేని హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు.

దాడి తీరును చూస్తే దేశంలో ఎవరికీ కూడా ఈ దుస్తితి రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదని అన్నారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

English summary
Bollywood's top director Mahesh Bhatt serious over Sanjay Leela Bhansali attack. He demands Rajasthan's Home ministers resignation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu