»   »  దర్శకుడిపై దాడి ఘటన: కామసూత్ర తరహాలో చేయాల్సింది!

దర్శకుడిపై దాడి ఘటన: కామసూత్ర తరహాలో చేయాల్సింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జైపూర్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మీద ఇటీవల 'పద్మావతి' షూటింగ్ సెట్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెట్లోకి దూసుకొచ్చిన కొందరు ఆందోళనకారులు ఆయనపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టుపట్టి దారుణంగా ప్రవర్తించారు. రాజ్ పుత్ కర్ణి సేన ఈ దాడికి పాల్పడింది.

ఈ దాడి ఘటనను ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం ఖండించింది. దాడి జరిగిన 5 రోజులు గడిచినా ఇంత వరకు పోలీసులు కేసు నమోదు చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ఫోన్ చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినా ఆమె స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Sanjay Leela Bhansali Seeks Karni Sena's Cooperation For Shooting 'Padmavati'

స్థానిక రాజకీయ నాయకులు, హిందూ సంస్థల నేతలకు భయపడే.... దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీసులు, రాజస్థాన్ ప్రభుత్వం వెనకాడుతోందని అంటున్నారు. మరో వైపు సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవని సినిమా యూనిట్ సభ్యలు అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ముందే తమను సంప్రదించి, సినిమాలో అలాంటి సీన్లు లేవని చెప్పి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని రాజ్ పుత్ కర్ణి సేన సభ్యులు అంటున్నారు.

సంజయ్ లీలా భన్సాలీపై దాడికి కారణం ఇదే...

కాగా...సంజయ్ లీలా భన్సాలీ తాను తీస్తున్న పద్మావతి మూవీ నేపథ్యం గురించి ముందే చెప్పకుండా షూటింగ్ పూర్తి చేసి ఉంటే ఇలాంటి దాడి ఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు. గతంలో మీరా నాయర్ కామసూత్ర చిత్రాన్ని ఇలాగే తీసిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

కామసూత్ర సినిమా అని ముందే చెబితే అక్కడి స్థానికుల నుండి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతోనే.... సినిమా పేరుగానీ, నేపథ్యంగానీ చెప్పకుండా ప్రాజెక్ట్-5 పేరుతో సినిమాను పూర్తి చేసారు. సంజయ్ లీలా భన్సాలీ కూడా అలాగే పూర్తి చేయాల్సి ఉండేది అని అభిప్రాయ పడుతున్నారు.

English summary
Filmmaker Sanjay Leela Bhansali's production team has assured Shree Rajput Karni Sena that no intimate and/or romantic scene between Alauddin Khilji and Padmavati would be shown in his movie 'Padmavati', the Karni Sena claimed here on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu