»   » గెడ్డం గీయించుకుంటూ ప్రభాస్ హీరోయిన్, వీడియో వైరల్

గెడ్డం గీయించుకుంటూ ప్రభాస్ హీరోయిన్, వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన సంజనా గుర్తుందా, పోనీ , నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా..యస్ ఆమె గురించి ఇక్కడ చెప్తోంది.

సంజనా మొదటినుంచీ మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునే బాపతు. హీరోయిన్స్ అన్నాక మేకప్ విషయంలో ఆ మాత్రం శ్రద్ద ఉండదా అంటారా..అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు డౌట్ వచ్చిందా? మేం నమ్మం అంటారా.అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు నమ్మక తప్పదు.

హీరోయిన్లు తమ అందం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు.

హీరోయిన్ సంజనాపై నిర్మాతల ఫిర్యాదు, క్షమించమంటూ సంజన

హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు.


ఇక హఠాత్తుగా గెడ్డం గీయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారా... పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు.

కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది.

ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం. అదండీ విషయం.

English summary
In the video, Sanjanna, last seen in Telugu in Sardar Gabbar Singh, says she is shaving because she is undergoing a laser treatment. "It's so cool... ha ha ha ..." she says even while hair from her cheeks and chin is being removed with a razor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu