»   » ‘తిక్క రేగితే’ సినిమా ప్రకటించిన సంతోష్ శ్రీనివాస్

‘తిక్క రేగితే’ సినిమా ప్రకటించిన సంతోష్ శ్రీనివాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమా ప్రకటించారు. 'రభస' తర్వా త 'తిక్కరేగితే' టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. 'రభస' సినిమా పూర్తయిన తర్వాత 'తిక్క రేగితే' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'తిక్క రేగితే' చిత్రాన్ని రవితేజ లేదా అల్లు అర్జున్‌తో తెరకెక్కించే అవకాశ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో రభస షూటింగ్ ఫినిష్ చేసుకుని, దానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు సంతోష్ శ్రీనివాస్.

Santosh Srinivas about ‘Tikka Regithe’

రభస సినిమా విషయానికొస్తే...
సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం కేవలం నటించడం మాత్రమే కాదు...ఓ పాట కూడా పాడారు జూ ఎన్టీఆర్. 'రాకాసి రాకాసి' అనే సాంగును జూ ఎన్టీఆర్‌తో పాడించాడు సంగీత దర్శకుడు తమన్. గతంలోనూ జూ ఎన్టీఆర్ తన సినిమాల్లోని పాటలకు మధ్య మధ్యలో వాయిస్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలిసారిగా పూర్తిగా పాటను పాడారు.

ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ బ్యాలెన్స్ పాట పూర్తి చేయడం కోసం విదేశాలకు వెళ్లారు. పాట షూటింగ్ పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. జులై 27న ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Director Santosh Srinivas revealed that he is ready with his next film, which is titled ‘Tikka Regithe’. Once he winds up NTR’s project, he will officially announce this film and other details such as star cast and banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu