»   » సూపర్ ఫాస్ట్ ..: సప్తగిరి హీరోగా.. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ట్రైలర్ ఇదిగో ... (వీడియో)

సూపర్ ఫాస్ట్ ..: సప్తగిరి హీరోగా.. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ట్రైలర్ ఇదిగో ... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సప్తగిరి, రోషిణి ప్రకాశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'. అరుణ్‌ పవార్‌ దర్శకుడు. సాయి సెల్యూలాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స పతాకంపై డా కె.రవికిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని ఆదివారం రాత్రి జరిగిన ఆడియో పంక్షన్ లో విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి...

Photos : సప్తగిరి ఆడియో లాంచ్


Saptagiri Express Theatrical Trailer released

జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.


హాస్యనటుడుగా స్టార్ స్టేటస్ సంపాదించి, దాదాపు తెలుగులో వచ్చే ప్రతి సినిమాలోనూ కనపడుతున్న సప్తగిరి, తాజాగా పూర్తి స్థాయి హీరో పాత్రలో నటించిన సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శిష్యుడైన అరుణ్ పావర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఉంది.


శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌.

English summary
Sapthagiri’s upcoming movie Sapthagiri Express Theatrical trailer is released at audio function.Power star Pawan Kalyan attended the audio function .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu