»   »  ఎక్స్ ఫోజింగ్ గొప్ప కాదు, దిగజారుడు తనమే: శారద

ఎక్స్ ఫోజింగ్ గొప్ప కాదు, దిగజారుడు తనమే: శారద

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్ ఫోజింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అందాల ఆరబోత లేకుండా ఇప్పటి సినిమాలు అసలు ఉండటం లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే సినిమాల్లో ఈ ధోరణి పెరుగుతుండటం, సమాజంపై కూడా వాటి ప్రభావం పడుతుండటంపై శారద లాంటి సీనియర్ హీరోయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మదర్స్ డే సందర్భంగా సీనియర్ నటి శారద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోయిన్ల తీరును ఏకిపారేసారు. ఇప్పటి హీరోయిన్స్‌ను చూస్తుంటే ఏమనిపిస్తోంది అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ఈతరం హీరోయిన్స్ దుస్తులు చూస్తుంటే వాటి‌పై ఖర్చు దండుగ అని హీరోయిన్స్ అనుకుంటున్నారో లేక నిర్మాతలు అనుకుంటున్నారో తనకు అర్ధం కావడంలేదని వ్యాఖ్యానించారు

Sarada hits out at Young Heroines!

ఇప్పటి హీరోయిన్లు సినిమాల్లో గుర్తింపు ఉండే పాత్రలు చేయడం లేదని, వారు అందాల ఆరబోతకు తప్ప నటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అభిప్రాయ పడ్డారు. నేటి టాప్ హీరోయిన్స్ నటించిన ఏ సినిమా కూడా పది సంవత్సరాల తరువాత కనీసం బుల్లితెర పై కూడా కనిపించవు అని ఘాటైన వ్యాఖ్యలు చేసారు శారద.

ఎక్స్ ఫోజింగ్ అంశాన్నిసినిమా విజయంతో ముడి పెట్టి చూడటం సరికాదని, ఎక్స్‌పోజింగ్ చేస్తున్నా సినిమాలు హిట్ అవుతున్న సందర్భాలు చాలా తక్కువుగా కనిపిస్తున్నాయన్నారు. సినిమా వాళ్లను చూసి సాధారణ స్త్రీలు కూడా ఎక్స్ ఫోజింగుపై మక్కువ పెంచుకుంటున్నారని ఆమె అభిప్రాయ పడ్డారు.

కొందరు స్త్రీలు అసభ్యకరంగా వస్త్రధారణ చేసుకుంటూ ఏకంగా పెళ్ళిళ్లకు రావడం తనకు ఆశ్చర్యంగా ఉందని శారద చెప్పుకొచ్చారు. ఈ మధ్య హైదరాబాద్‌లో ఒక గొప్పవారి ఇంట్లో జరిగిన పెళ్ళిలో ఒక మహిళ విచిత్రమైన బ్లౌజ్‌ను వేసుకుని వచ్చి అందరూ తన శరీరం వంక చూస్తూ ఉంటే ఆమె చాలా ఆనందంగా మురిసి పోవడం చూస్తూ ఉంటే నేటి సమాజంలోని స్త్రీల పరిస్థితి ఇంత దిగిజారి పోయిందా అనే బాధ కలిగింది అని అన్నారు శారద.

English summary
"Present day heroes and heroines of Telugu industry are portraying the worst-ever roles on silver screen unlike in any other film industry," stresses veteran actress Sharada, who won two national awards (Urvasi) as a heroine of Telugu movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu