»   » స్కామ్: హీరోగారిని ఇ.డి. విచారిస్తోంది

స్కామ్: హీరోగారిని ఇ.డి. విచారిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‌కత: శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మిధున్‌ చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) త్వరలో విచారించనుంది. సాల్ట్‌లేక్‌లోని ఇ.డి. కార్యాలయంలో కాకుండా ముంబయిలోని మిధున్‌ నివాసంలో ఆయన్ని విచారించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఐయామ్ ఎ డిస్కో డాన్సర్'... పాట వినగానే, హిందీ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. దాదాపు 30 ఏళ్ల క్రితం మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన 'డిస్కో డాన్సర్'లోని ఈ పాట ఇప్పటికీ పాపులరే. ముఖ్యంగా ఈ పాటకు స్టయిల్‌గా మిథున్ వేసిన స్టెప్పులను మర్చిపోవడం అంత సులువు కాదు. ఆ స్టెప్పులకే మనసు పారేసుకున్న అమ్మాయిలు ఉన్నారు.

Saradha chit fund case: ED summons Mithun Chakraborty

దక్షిణాదిన మిథున్ సినిమాలు చేయకపోయినప్పటికీ, తను చేసిన హిందీ చిత్రాల ద్వారా ఇక్కడివారికి కూడా సుపరిచితులయ్యారు. కాగా, ఈ ఏడాది మిథున్ చక్రవర్తి తెలుగు తెరపై కనిపిస్తారని చెప్పొచ్చు. అది కూడా రెండు తెలుగు సినిమాల్లో కావడం విశేషం. రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా, హిందీ చిత్రం 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్‌లోనూ ఆయన నటించనున్నారని సమాచారం.

హిందీ వెర్షన్‌లో ధరించిన లీలాధర్ స్వామీజీ పాత్రను తెలుగులో కూడా మిథునే చేయనున్నారట. హిందీలో పరేష్ రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుని పాత్రను పవన్ కల్యాణ్ చేయనున్నారు. వెంకీ సరసన శ్రీయ నాయిక. డాలీ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
The Enforcement Directorate (ED) has summoned Trinamool Congress member of Parliament and actor Mithun Chakraborty on Friday to record his statement on a purported transaction in connection with the probe into the Saradha chit fund scam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu