»   » నేటి నుండి పవన్ సెట్ లో మెరవనున్న సారాజానే డయాస్

నేటి నుండి పవన్ సెట్ లో మెరవనున్న సారాజానే డయాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రస్తుతం కోల్ కత్తా లో జరుగుతున్న ఈ షూటింగ్ లో నేటి నుండి సినిమా హీరోయిన్ సారా జానే డయాస్ పాల్గొంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్, సారాల ఫై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

జూన్ 26 వరుకు కోల్ కతలో జరిగే ఈ షెడ్యూల్ తో సినిమా 40 శాతం పూర్తవుతుందని తెలుస్తుంది. షాడో అని వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించానున్నాడని వినికిడి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా, సంఘమిత్ర బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సారా జానే డయాస్, అంజలి లవనియ హీరోయిన్ లుగా నటిస్తుండగా జాకి ష్రాఫ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రం మాఫియా నేపద్యంలో నడుస్తుందని తెలుస్తుంది.

English summary
Actress Sarah Jane Dias is again joining the crew of Telugu movie star Pawan Kalyan starer 'The Shadow' for shooting in Kolkata. Currently action scenes were being shot and filming is going on a rapid pace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu