»   » షాకింగ్: శరత్ బాబుకు 25 మంది పిల్లలు, భార్య పేరు చెప్పడానికి నిరాకరణ!

షాకింగ్: శరత్ బాబుకు 25 మంది పిల్లలు, భార్య పేరు చెప్పడానికి నిరాకరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ, టీవీ రంగంలో నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు. శరత్ బాబు నటుడుగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో... వ్యక్తిగత జీవితానికి సంబంధించి మూడు వివాహాలు చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. గతంలో శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను, స్నేహ లతా దీక్షిత్ లను పెళ్లాడారు. ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు.

తర్వాత శరత్ బాబు మూడో వివాహం కూడా చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురు కాగా... భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు. నా భార్యపేరు మిస్సెస్‌ శరత్‌బాబు అని మాత్రమే చెప్పుకొచ్చారు.

 పాతిక మంది పిల్లలు

పాతిక మంది పిల్లలు

కాగా... తనకు పాతిక మంది పిల్లలు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు శరత్ బాబు. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు అందరూ కూడా పిల్లలే అని శరత్ బాబు తెలిపారు. నేను షూటింగ్‌లకు వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు అని. ఠక్కున చెబుతాను, పాతికమందని! జోకులెందుకు? సీరియ్‌సగా చెప్పండి అంటారు. సీరియ్‌సగానే చెబుతున్నాను అంటాను అని శరత్ బాబు స్పష్టం చేసారు.

 విడాకులపై

విడాకులపై

తన గత రెండు వివాహాల గురించి ఎదురైన ప్రశ్నకు శరత్ బాబు స్పందిస్తూ... వారి పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. జీవితం ఒక ప్రయాణం. జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల్లో పెళ్ళి కూడా ఒక సంఘటనే. కొన్ని జీవితకాలం ఉంటాయి. మరికొన్ని కాలం తీరిపోయినవి కాలగర్భంలో కలిసిపోతాయి. జీవితంలో ఏం జరిగినా మన మంచికే జరుగుతాయి అని శరత్ బాబు చెప్పుకొచ్చారు.

 శరత్ బాబుపై మొదటి భార్య రమా ప్రభా ఆరోపణలు

శరత్ బాబుపై మొదటి భార్య రమా ప్రభా ఆరోపణలు

కాగా....శరత్ బాబు మొదటి భార్య రమాప్రభ ఆ మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో శరత్ బాబు మీద సంచలన ఆరోపణలు చేసారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ కలిసి 16 ఏళ్ళు కలిసి కాపురం చేసి...తర్వాత విబేధాలతో విడిపోయారు. ప్లాన్డ్ గా తన ఆస్తి అంతా రాయిన్చుకొని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమా ప్రభ ఆరోపించారు.

 శరత్ బాబు టార్చర్ భరించలేక రెండో భార్య కూడా విడాకులు

శరత్ బాబు టార్చర్ భరించలేక రెండో భార్య కూడా విడాకులు

శరత్ బాబు రెండో భార్య స్నేహలతా దీక్షిత్ కూడా విడిపోయారు. ఆయన టార్చర్ భరించలేకే విడాకులు తీసుకున్నట్లు గతంలో ఆమె ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sarath Babu not revealed his wife name. Sarath Babu is an Indian film actor, known for his works in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi films. He has been in the industry for nearly 37 years and has acted in more than 200 films, most of them in a supporting role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu