»   » ఫస్ట్ లుక్: దేశి అవతారంలో ఐశ్వర్య రాయ్! (ఫోటోస్)

ఫస్ట్ లుక్: దేశి అవతారంలో ఐశ్వర్య రాయ్! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ‘సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

తాజాగా ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. బహుషా ఐశ్వర్యరాయ్ ని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూసి ఉండరు.

మరో వైపు రణదీప్ హుడా కూడా షాకింగ్ లుక్ లో కనిపించబోతున్నాడు. పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందో రణదీప్ హుడా లుక్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం రణదీప్ హుడా చాలా కష్టపడ్డాడు. భారీగా బరువు తగ్గాడు. ఇంతకు ముందు రణదీప్ హుడా కాజల్ తో నటించిన ‘దో లబ్జోంకి కహాని' సినిమాలో పాత్ర కోసం 94 కేజీల బరువు పెరిగాడు. తాజాగా ‘సరబ్జీత్‌' చిత్రం కోసం రణదీప్ ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడు. కేవలం 28 రోజుల్లో అతడు ఇంత భారీగా బరువు తగ్గడం విశేషం. డాక్టర్ అయిన తన సోదరి పర్యవేక్షణలో రణదీప్ హుడా బరువు తగ్గాడు.

స్లైడ్ షోలో ఫోటోస్...

సరబ్జీత్ సింగ్

సరబ్జీత్ సింగ్

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది.

ఐశ్వర్యరాయ్ డీగ్లామరస్ లుక్

ఐశ్వర్యరాయ్ డీగ్లామరస్ లుక్

ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో ఇలా డీ గ్లామరస్ లుక్ లో కనిపించబోతున్నారు.

ప్రతీకార హత్య

ప్రతీకార హత్య

లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు.

కథాంశం..

కథాంశం..

సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

రణదీప్ హుడా

రణదీప్ హుడా

సరబ్జీత్‌ చిత్రంలో రణదీప్ హుడా ఇలా చిక్కిపోయిన కనిపించబోతున్నాడు.

రీచా చద్దా

రీచా చద్దా

ఈ చిత్రంలో సరబ్జీత్‌ భార్య పాత్రలో రీచా చద్దా నటిస్తోంది.

English summary
Sarbjit first look is out and Aishwarya Rai Bachchan looks breathtakingly beautfiul in her desi avatar. The actress has transformed into a whole new look for this biopic directed by Omung Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X