»   » పవన్ తలుచుకుంటే అంతే: సర్దార్ సెన్సార్ రిపోర్ట్

పవన్ తలుచుకుంటే అంతే: సర్దార్ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తలుచుకుంటే పనులు ఎంత త్వరగా పూర్తవుతాయో 'సర్దార్ గబ్బర్ సింగ్' చివరి షెడ్యూల్స్ లో జరిగిన షూటింగు తీరు చూస్తే అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ మిగిలి ఉండటంతో అన్నయ్య చిరంజీవి కూతురు శ్రీజ వివాహానికి డుమ్మాకొట్టి మరీ స్విట్జర్లాండ్ వెళ్లి షూటింగ్ పూర్తి చేసారు పవర్ స్టార్.

షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా ఫైనల్ కాపీ రెడీ చేసి గురువారం సెన్సార్‌కు పంపడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాక సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Sardaar Gabbar Singh completes its censor

ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. బాబీకి థాంక్స్. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు. అంతే తప్పు ఏ సినిమాకు పోటీగా ఆలోచించలేదు అన్నారు పవన్.


పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' చిత్రం గతంలో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్ పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసాడు. ఈ నేపథ్యంలో తన తాజా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్టు సమకూర్చడం చర్చనీయాంశం అయంది. దీనిపై పవన్ స్పందిస్తూ...ఈ చిత్రంతో జానీలా డిసప్పాయింట్ చేయనని నమ్మకం ఉంది అన్నారు.

English summary
Latest update reveals that Sardaar Gabbar Singh censor has been completed and the film has received an U/A from the board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu