»   » పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా చేరిందని, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్నారని 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల 2 కోట్లు నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఆరోపించారు.

  సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సంపత్ కుమార్.... పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్ మీద పండి పడ్డారు. 'సర్దార్' వల్ల నష్టపోయిన వారిని పట్టించుకోవడం లేదని...తమ గోడు వెల్లబోసుకుందామంటే పవన్ కళ్యాణ్ ను కలవనీయడం లేదన్నారు. ప్రెస్ మీట్ పెడితే అంతు చూస్తాం, సంగతి చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.


  కృష్ణ జిల్లాకు 'సర్దార్ గబ్బర్ సింగ్' 4.5 కోట్లకు కొన్నాను. అపుడు 4.38 కోట్లు పేచేసాం. కేవలం 3 శాతం అప్పటి పరిస్థితుల వల్ల పే చేయలేక పోయాం. సినిమాకు టోటల్ గా 2.58 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. తాను ఈ సినిమా వల్ల దాదాపు 2 కోట్లు నష్టపోయినట్లు సంపత్ కుమార్ తెలిపారు.


  అపుడు హ్యాపీగా ఫీలయ్యాం

  అపుడు హ్యాపీగా ఫీలయ్యాం

  అపుడు సినిమాకు నష్టాలు వచ్చిన వెంటనే.... పవన్ కళ్యాణ్ స్పందించారు, తనను నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగిందని, వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసి నష్టపోయిన వారందరికీ సినిమాను ఇద్దామని సినిమా స్టార్ట్ చేసారు. ఆయన సినిమా(కాటమరాయుడు) మొదలు పెట్టగానే చాలా హ్యాపీగా పీలయ్యాం. నష్టపోయిన వారమంతా గత సంవత్సరం పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ ను కలిసాం. టచ్ లో ఉండమని చెప్పారు. సంవత్సరం వెటింగ్ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కలుద్దామన్నారని తెలిపారు.


  అన్యాయం చేసారు

  అన్యాయం చేసారు

  అపుడు సినిమాను మాకు ఇస్తామని చెప్పి... ఇపుడు సినిమాను వేరే వారికి ఇచ్చారు. ఈ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయిన మా పరిస్థితి ఏమిటి? అని సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఈ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయింది నైజాం డిస్ట్రిబ్యూటర్ (8 కోట్ల నష్టం) , కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ గా నేను 2 కోట్లు నష్టపోయామని... అపుడు నష్టపోయిన మాకు సినిమా ఇవ్వకుండా వేరొకరికి సినిమా ఇవ్వడం అన్యాయమని సంపత్ కుమార్ చెప్పారు.


   మమ్మల్ని పట్టించుకోవడం లేదు

  మమ్మల్ని పట్టించుకోవడం లేదు

  ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా అగ్రిమెంటు సమయంలో నాన్ రికవరబుల్ అనే అగ్రిమెంటులో మేము సంతకం పెట్టింది నిజమే. కానీ అపుడు పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాసరావు ఇది పవన్ కళ్యాణ్ సొంతబేనర్ లాంటిది, ఏదైనా తేడా వస్తే ఆయన ఆదుకుంటారు అని మమ్మల్ని కన్విన్స్ చేసి సంతకం పెట్టించారు. ఈరోస్ వాళ్లు ఎవరో మాకు తెలియక పోయినా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో సంతకం పెట్టి కొన్నాం. ఇపుడు వారు సినిమా మీరు మా వద్ద కొనలేదు, ఈరోస్ వారి వద్ద కొన్నారు.... మాకు సంబంధం లేదు అని మొహం చాటేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్ మా ఫోన్లు ఎత్తడం లేదు, మేసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదని సంపత్ కుమార్ వాపోయారు.


  పవన్ కళ్యాణ్ అభిమానులం

  పవన్ కళ్యాణ్ అభిమానులం

  మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఆయనపై నమ్మకంతో సినిమా కొన్నాం. ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే కొన్నాం. గతంలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాలు రూ. 3.75 కోట్లకు మించి బిజినెస్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మేనేజర్ మాకు అపుడు భరోసా ఇచ్చి రూ. 4.5 కోట్లకు ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని కొనేలా చేసారు అన్నారు.


  మా హీరోను అవమాన పరుచాలని కాదు

  మా హీరోను అవమాన పరుచాలని కాదు

  పవన్ కళ్యాణ్ ను కించపరుచాలనో, ఆయన్ను అవమాన పరుచాలనో ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన కళామతల్లి ముద్దు బిడ్డ. ఆయనకు తెలియకుండా ఇదంతా జరుగుతోంది. మేము నష్టపోయిన విషయం, నష్టపోయిన మాకు సినిమా ఇవ్వలేదనే విషయం ఆయన వరకు చేరాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టామని సంపత్ కుమార్ వెల్లడించారు.


  మా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు

  మా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు

  మేము ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారు. పరువు నష్టం దావా వేస్తే అక్కడికి పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తారు, మా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది అని సంపత్ కుమార్ వెల్లడించారు.


  English summary
  Sampath Kumar acquired 'Sardaar Gabbar Singh' Krishna district rights for Rs 4.5 crore. In the full run, This Cop Drama recovered only Rs 2.58 crore Share and hence a loss to the tune of Rs 1.9 crore has been incurred by the Distributor. Today, Sampath Kumar called for a press conference and leveled serious allegations against the Producers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more