»   » ఈ మాత్రమైనా వచ్చాయి: ‘సర్దార్’ క్లోజింగ్ బిజినెస్ డైటేల్స్

ఈ మాత్రమైనా వచ్చాయి: ‘సర్దార్’ క్లోజింగ్ బిజినెస్ డైటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించడంతో పాటు... కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా తానే నిర్వర్తించి చేసిన చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. భారీ అంచనాలతో రిలీజైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద సినిమా బిజినెస్ క్లోజ్ అయింది.

సినిమా ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లో కలిపి ఫుల్ రన్ లో రూ. 52.92 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా చెల్లింపులు చేసి కొన్నారు. కొన్న ప్రతి ఒక్కరూ నష్టపోయినట్లు ట్రేడ్ టాక్. చివరకు నిర్మాతకు కూడా నష్టాలు తప్పలేదు.


లాభనష్టాలే బేరీజు వేసాక ఈ సినిమా వల్ల శరత్ మరార్ రూ. 8 కోట్ల వరకు నష్టపోయినట్లు తేలిందట. వాస్తవానికి 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ అనుకున్న సమయానికి, అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగలేదు. దీనికి తోడు మధ్యలో సినిమాటోగ్రాఫర్ ను మార్చేయడం, హీరోయిన్ ను మార్చేయడం, డైరెక్టర్ ను మార్చేయడం, ఆర్ట్ డైరెక్టర్ ను మార్చేయడం ఇలా చాలా విషయాలు జరిగాయి. బహుషా ఏ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా సినిమా మొదలయ్యాక ఇన్ని మార్పులు జరిగి ఉండవు.


మధ్యలో తప్పించిన వారందరికీ శరత్ మరార్ ముందుగానే రెమ్యూనరేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కూడా ఖర్చు తడిసి మోపెడైంది. లాభాలు వస్తాయనే నమ్మకంతో శరత్ మరార్ ఇవన్నీ భరించారు. కానీ చివరకు ఆయనకు మిగిలింది 8 కోట్ల నష్టం.


స్లైడ్ షో ఈ చిత్రం ఫుల్ రన్ లో వివిధ ఏరియాల్లో వసూలు చేసిన కలెక్షన్ వివరాలు.


నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో


నైజాం ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 12.05 కోట్ల షేర్ సాధించింది.


సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 8.40 కోట్ల షేర్ సాధించింది.


నెల్లూరు

నెల్లూరు


ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 1.73 కోట్ల షేర్ సాధించింది.


క్రిష్ణ

క్రిష్ణ


క్రిష్ణ ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 2.96 కోట్ల షేర్ వసూలు చేసింది.


 ఈ మాత్రమైనా వచ్చాయి: ‘సర్దార్’ క్లోజింగ్ బిజినెస్ డైటేల్స్

ఈ మాత్రమైనా వచ్చాయి: ‘సర్దార్’ క్లోజింగ్ బిజినెస్ డైటేల్స్

గుంటూరు ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 4.10 కోట్ల షేర్ వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్


వైజాగ్ ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 4.15 కోట్ల షేర్ వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి


ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 3.80 కోట్ల షేర్ వసూలు చేసింది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం పుల్ రన్ లో రూ. 3.75 కోట్లు వసూలు చేసింది.


ఏపీ, తెలంగా

ఏపీ, తెలంగా


ఏపీ తెలంగాణలో ఫుల్ రన్ లో రూ. 40.94 కోట్ల షేర్ వసూలు చేసింది.


కర్నాటక

కర్నాటక


కర్నాకలో ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 5.10 కోట్ల షేర్ వసూలు చేసింది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా


రెస్టాఫ్ ఇండియాలో ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 1.53 కోట్లు వసూలు చేసింది.


ఓవర్సీస్

ఓవర్సీస్


ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం రూ. 5.35 కోట్ల షేర్ వసూలు చేసింది.


ఫుల్ రన్ వరల్డ్ వైడ్

ఫుల్ రన్ వరల్డ్ వైడ్


వరల్డ్ వైడ్ ఫుల్ రన్ లో రూ. 52.92 కోట్ల షేర్ వసూలు చేసింది.


English summary
Power Star Pawan Kalyan's 'Sardaar Gabbar Singh' collected a share of Rs.52.92 crores world wide at the end of its full run world wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu