»   » పవన్ కళ్యాణ్‌ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరప్పా (ఇంటర్వ్యూ)

పవన్ కళ్యాణ్‌ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరప్పా (ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు కెఎస్. రవీంద్ర(బాబీ) మీడియాతో సినిమా గురించి కాసేపు మెచ్చటించారు.

'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో చేయడం విశేషం. అసలు అతనికి ఈ అవకాశం ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభవం ఎలా ఉంది? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన అనుభవాలు ఏమిటి అనే విషయాలు బాబీ చెప్పుకొచ్చారు.


తనకు ఈ సినిమా చేసే అవకాశం రావడంపై బాబీ స్పందిస్తూ... నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ప‌వ‌ర్ 2014 సెప్టెంబర్లో విడుదలైంది. అది రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత నాకు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఫోన్ వచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారితో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చేస్తారా అని అడిగారు. ఆయన అలా అడగ్గానే నమ్మలేక పోయాను. సినిమా అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేవ‌ర‌కు నేను దాన్ని క‌లగానే భావించాను అన్నారు.


తొలుత నాకు పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చారు. దాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. అందుకు దాదాపు 5 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 2015లో ఏప్రిల్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టాం. ఈ ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తున్నాం. సినిమా పూర్తవ్వడానికి ఏడాది పాటు సమయం పట్టింది అన్నారు. పవన్ క‌ళ్యాణ్‌గారు మంచి స్పాన్ ఉన్న కథ ఇచ్చారు. దానికి త‌గ్గ‌ట్టు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని బాబీ చెప్పారు.


పవన్ కళ్యాణ్ వేలు పెట్టారా?

పవన్ కళ్యాణ్ వేలు పెట్టారా?

ర‌చ‌యిత‌గా ఆయ‌న నాకు హెల్ప్ చేశారు. అంతేగానీ డైర‌క్ష‌న్‌, ఫోటోగ్ర‌ఫీలో ఆయ‌న ఎక్క‌డా జోక్యం చేసుకోలేదు అన్నారు బాబీ.


ట్రైలర్లోనే కథ చెప్పడానికి కారణం అదే..

ట్రైలర్లోనే కథ చెప్పడానికి కారణం అదే..

పవన్ కళ్యాణ్‌గారి సినిమాల‌కు భారీ అంచ‌నాలు ఉంటాయి. దాన్ని త‌ట్టుకోవాలంటే ముందే స్టోరీ హింట్ ఇవ్వాలి. అభిమానులకు థియేటర్లో విజువల్ ట్రీట్ ఇశ్వబోతున్నాం. కథ ముందే చెప్పడం వల్ల ప్రేక్షకులు ఏదో ఊహించుకోవడం తగ్గుతుంది అన్నారు. బాలీవుడ్లో, హాలీవుడ్లో ఇపుడు ఇదే ట్రెండు నడుస్తుందన్నారు.


టెన్షన్ పడ్డాం

టెన్షన్ పడ్డాం

జ‌న‌వ‌రి దాకా షూటింగ్ మామూలుగానే సాగింది. కానీ క‌ల్యాణ్‌గారు ఓ రోజు పిలిచి ఏప్రిల్‌లో మ‌న సినిమా రిలీజ్ చేద్దాం అన్నారు. ఆయన అలా అనగానే నేను, శ‌ర‌త్‌గారు ఒక‌టే టెన్ష‌న్ ప‌డ్డాం. నిర్విరామంగా చిత్రీక‌రించేశాం. సెన్సార్ కూడా పూర్తయింది అన్నారు.


పవన్ ను తట్టుకుంటే వచ్చే కిక్కు..

పవన్ ను తట్టుకుంటే వచ్చే కిక్కు..

ప‌వ‌న్ కళ్యాణ్‌గారితో ప‌నిచేశాక స‌హ‌నం నేర్చుకున్నాను. ఆయ‌న్ను త‌ట్టుకుంటే వ‌చ్చే కిక్కు ఇంకో ర‌కంగా ఉంటుంది. ఆయ‌న ప్ర‌శంసించే తీరు, గుర్తించే తీరు జీవితంలో మ‌ర్చిపోలేం. నేను చిరంజీవి అభిమానిని. నా గురించి చిరంజీవిగారితో బాగా చెప్పారు. నువ్వు కూడా త‌న‌తో సినిమా చెయ్ అన్న‌య్యా` అని చెప్పార‌ట ప‌వ‌న్‌గారు. అంత‌క‌న్నా ఏం కావాలి. అదే పెద్ద అప్రిషియేష‌న్ నాకు అని బాబీ తెలిపారు.


రవితేజతో..

రవితేజతో..

పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రాగానే ముందు ర‌వితేజ‌గారికే ఫోన్ చేసి చెప్పా. ఆయ‌న న‌న్ను సొంత త‌మ్ముడిగా చూసుకుంటారు కాబట్టి విన్న వెంట‌నే సంతోషించారు.


వీణ స్టెప్

వీణ స్టెప్

ఈ సినిమాలో ఏదో ర‌కంగా చిరుగారిని ట‌చ్ చేయాల‌ని అనుకున్నాం. అందుకే వీణ స్టెప్‌ని పెట్టాం. వీణ స్టెప్‌ని ప‌వ‌న్ ఎలా వేస్తే బావుంటుందో ఈ సినిమాలో చూపించాం అన్నారు బాబీ.


నో పాలిటిక్స్..

నో పాలిటిక్స్..

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ పొలిటిక‌ల్ డైలాగ్స్ ఏమీ చెప్ప‌రు. కానీ ఆయ‌న ఆల్రెడీ పొలిటిక‌ల్ ప‌ర్స‌న్ కావ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా ఏమైనా క‌నెక్ట్ అయినా ఏమీ చెప్ప‌లేం. ఎందుకంటే ఆయ‌న ఓ వైపు సినిమాల గురించి ఆలోచిస్తూనే మ‌రో వైపు ప్ర‌జ‌లగురించి ఆలోచిస్తుంటారు అని బాబీ చెప్పుకొచ్చారు.


English summary
Check out Sardaar Gabbar Singh movie director KS Ravindra interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu