»   » హ్యాపీ న్యూస్: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముందుగా వస్తున్నాడు!

హ్యాపీ న్యూస్: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముందుగా వస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్' అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.

గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సర్దార్ గబ్బర్ సింగ్‌ను నెలరోజుల ముందుగా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి దిగే ఆలోచనలో పవన్ ఉన్నాడని.. అందుకే అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను వీలయినంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట.


 Sardaar Gabbar Singh release preponed

సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కోస్టార్స్ షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ఎంజాయ్ చేస్తూ శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటిక బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన సెల్పీని తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Powerstar Pawan Kalyan’s Sardaar Gabbar Singh teaser doubled the expectations on this movie and now, everyone is eagerly waiting to watch this film. If the ongoing buzz is to be believed, it is heard that the makers are planning summer race.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu