»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ మరో రికార్డ్

‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ మరో రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్' స్పెషల్ టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ విడుదలైన 48 గంటల లోపే 1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్‌లో లుంగీ ధరించి... గుర్రంతో దర్శనమిచ్చారు. సంక్రాంతి పండగ హాలిడే లేకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వలైనంత త్వరంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నారు.


కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Sardaar Gabbar Singh Sankranthi teaser hits 1 Million views!

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.


పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఓ సీన్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని.... ఆ సీన్లో అయాన్ నటించాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్ ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయాన్ వయసు ఇంకా 2 సంవత్సరాల లోపే ఉండటం గమనార్హం.

English summary
Sardaar Gabbar Singh Sankranthi teaser hits 1 Million views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu