»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ లీకైందట, ఇదేనా?

‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ లీకైందట, ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ లీకైందనే ప్రచారం జరుగుతోంది. యూట్యూబులో ఇందుకు సంబంధించిన ఆడియో ట్రాక్ ఒకటి హల్ చల్ చేస్తోంది. అయితే ఇది నిజంగానే సినిమా టైటిల్ సాంగా? లేక ఫేక్ సాంగా? అనేది తేలాల్సి ఉంది.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో లక్ష్మీ రాయ్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ...‘సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం డాన్స్ కూడా చేయడం మీరు చూస్తారు' అని వెల్లడించారు. దీన్ని బట్టి ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఐటం సాంగ్ ఉంటుందని స్పష్టమవుతోంది.

 Sardaar Gabbar Singh Title Song Leaked

కాగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత శరత్ మరార్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ విడుదల చేసారు. దీనికి మంచి స్పందన వస్తోంది. పవన్ కళ్యాణ్ లుక్ అదిరి పోయే విధంగా ఉందని అభిమానులు ఫ్యాన్స్ అంటున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు సంబంధించిన లోగోలతో పాటు ఈరోస్ సంస్థ లోగో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది.

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    Sardaar Gabbar Singh Title Song Leaked.
    Please Wait while comments are loading...