twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ’సర్దార్’సత్తా : ఫ్యాన్స్ ’ఫ్లాష్ మాబ్స్’,700 గన్స్,స్టీవ్ మెక్వీన్ ప్రభావం

    By Srikanya
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అబిమానులు చాలా కాలంగా చూస్తున్న ఎదురుచూపులు ఫలించే క్షణాలు రోజుల్లోకి వచ్చేసాయి. మరి రెండు రోజుల్లో సర్దార్ అభిమానులను అలరిస్తూ ధియోటర్స్ లోకి దిగనున్నారు. గత సంవత్సరం గోపాల గోపాల అంటూ వచ్చిన పవన్ నిజానికి పెద్దగా కిక్ ఇవ్వలేదు. దాంతో ఈ సినిమాపై పూర్తి నమ్మకాలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.

    మరి ఈ స్ధాయిలో ఎదురుచూపులు ఉన్న సినిమాకు క్రేజ్ ఎలా ఉంటుంది. ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుంది అంటే ఊహించలేరు. సమయం దగ్గరపడుతూండటంతో సర్దార్ హంగామా ఓ రేంజిలో మొదలైంది.ఉగాది రోజున విడుదల అవుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' కి సంబంధించి అప్పుడే అభిమానుల హడావుడి కి సంభందించిన కొన్ని ఫొటోలు ఇక్కడ అందిస్తున్నాం.

    ఇండియాలోని చిన్న పల్లె నుంచి అమెరికా దాకా గబ్బర్ సింగ్ మానియా పవన్ అభిమానుల్లో కనిపిస్తున్నది. రాజమండ్రి లో కొన్ని ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఫ్లాష్ మాబ్స్' నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

    ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మొదటిసారి హిందీ రంగం లో కాలు మోపుతున్నారు. ఇండియాలోనే కాక ప్రపంచంలో దాదాపు యాభై దేశాల్లో భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' ని విడుదల ముందు రోజు చాలా చోట్ల స్పెషల్ షో లు వేస్తున్నారు.

    భారీ అంచనాల మధ్య ఉగాది రోజున విడుదల అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రికార్డ్ స్థాయి లో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

    స్లైడ్ షోలో చిత్రం విశేషాలు..ఫ్యాన్స్ హంగామా ఫొటోలు

    గన్స్ గురంచే...

    గన్స్ గురంచే...

    'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలకు సిద్ధమవుతుండటంతో ఇప్పుడు అందరూ ఇందులో వాడిన గన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.

    ఒక్క ఫైట్ కోసం..

    ఒక్క ఫైట్ కోసం..

    ముఖ్యంగా ఇందులో ఓ ఫైట్ కోసం దాదాపు 700 తుపాకీలను ఉపయోగించినట్లు తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    వెస్ట్రన్

    వెస్ట్రన్

    కానీ పవన్ కళ్యాణ్ కి వెస్ట్రన్ సినిమాలంటే చాలా ఇష్టం కావడంతో ఈ సినిమాని అలా డిజైన్ చేసారు.

    పవన్ స్వయంగా..

    పవన్ స్వయంగా..

    స్టీవ్ మెక్వీన్ అభిమాని కావడంతో ఆ ప్రభావంతో ఈ సినిమాని రూపొందించినట్లు చెబుతున్నారు.

    ఆ కారణం చేతే

    ఆ కారణం చేతే

    అందుకే ఈ సినిమాలో గన్స్ వాడకం ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

    ఇలాంటివే

    ఇలాంటివే

    ఏకే 47, .44 మాగ్నమ్స్, షాట్ గన్స్, రైఫిల్స్... ఇలా రకరకాల తుపాకులను 'సర్దార్ గబ్బర్ సింగ్' లో వాడారు.

    ఆ సినిమాలో

    ఆ సినిమాలో

    'డెడ్ ఆర్ అలైవ్' అనే హాలీవుడ్ మూవీలో ఉపయోగించిన 'ది మేర్స్ లెగ్' అనే గన్ ని వాడారు.

    ఆ గన్ ని కూడా..

    ఆ గన్ ని కూడా..


    సిలికాన్ మాఫియా ఎక్కువగా ఉపయోగించే '12 బేస్ షాట్' అయిన 'లుపారా' అనే ఓ షాట్ గన్ ను కూడా వాడారు.

    లెగ్ రైఫిల్

    లెగ్ రైఫిల్

    అంతేకాకుండా 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ప్రత్యేకంగా నిలిచే 'లెగ్ రైఫిల్' అనే గన్ ని ఒరిజినల్ గన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా తుపాకీలు చేసేవారితో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయించినట్లు సమాచారం.

    ఎలాగంటే..

    ఎలాగంటే..


    చాలా తేలికపాటి ఇనుము, థర్మాకోల్ ఉపయోగించి ఈ గన్స్ ని తయారు చేసినట్లు సమాచారం.

    సౌండింగ్ విషయంలోనూ...

    సౌండింగ్ విషయంలోనూ...

    వీటి సౌండింగ్ విషయంలో కూడా పవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని చెబుతున్నారు.

    50 దేశాల్లో..

    50 దేశాల్లో..

    ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల అవుతున్నది.

    ఖుషి తరువాత ...

    ఖుషి తరువాత ...

    ఆ రేంజ్ హిట్ కోసం 10 ఏళ్ళు ఎదురుచూశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ తో ఆ కోరిక తీరడమే కాక తను కోల్పోయిన ఫాలోయింగ్ కి పదింతలు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా.

    ఫ్రాంచైజ్

    ఫ్రాంచైజ్

    అలాంటి సినిమాకు ప్రాంచైజ్ అంటే ఏ రేంజ్ అంచనాలతో రావాలో అలాంటి అంచనాలతోనే వస్తుంది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్దార్ గబ్బర్ సింగ్.

    భారీ రెస్పాన్స్

    భారీ రెస్పాన్స్

    ఈ మధ్యనే రిలీజ్ అయిన టీసర్ అప్పుడే 1 మిలియన్ కి పైగా వ్యూస్ ని తెచ్చుకోవడమే కాకుండా 45 వేలకు పైగా లైక్స్ తో టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.

    హిందీలోనూ...

    హిందీలోనూ...

    కాగా మొదట కేవలం తెలుగు వరకే అనుకున్న సినిమాను ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతుండటంతో అక్కడ సర్దార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

    500 ధియోటర్స్

    500 ధియోటర్స్

    ఇండియాలోనే భారీ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఎరోస్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తూ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటంతో హిందీలో సుమారు 500 థియేటర్లలో సర్దార్ గబ్బర్ సింగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

    రెండు కలిస్తే...

    రెండు కలిస్తే...

    దాంతో ఇప్పుడు తెలుగు కలెక్షన్స్ కి తోడు హిందీలో సర్దార్ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతాడో అని అంటా ఆశగా ఎదురుచూస్తున్నారు.

    అత్తారింటికి దారేది తర్వాత

    అత్తారింటికి దారేది తర్వాత

    పవన్ సోలోగా చేసిన ఈ చిత్రం అత్తారింటికి దారేది తర్వాత అంత కన్నా భారి స్దాయిలో విడుదల అవుతోంది.

    డెకరేషన్

    డెకరేషన్

    అభిమానులు అంతా ఇప్పుడు కటౌట్స్ రెడీ చేయటం, ధియోటర్స్ డెకరేట్ చేయటంలో బిజీగా ఉన్నారు.

    English summary
    Pawan Kalyan fans are going all their way out to put the social networking sites ablaze with the actor's mania.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X