»   »  'సర్దార్' లేటెస్ట్ ఇన్ఫో : లక్ష్మితో కలిసే పవన్ సెట్స్ కు

'సర్దార్' లేటెస్ట్ ఇన్ఫో : లక్ష్మితో కలిసే పవన్ సెట్స్ కు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్ ' షూటింగ్ గత కొద్ది రోజులుగా జరగటం లేదనే సంగతి తెలిసిందే. రకరకాల కారణాలతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. అయితే ఈ చిత్రానికి సంభందించన తాజా సమాచారం ఏంటంటే నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 30 నుంచి అని తెలుస్తోంది. అది కూడా కిక్కు ఇచ్చే ఐటం సాంగ్ తో మొదలెట్టాలని పవన్ నిర్ణయించాడని చెప్తున్నారు.

ఈ ఐటం సాంగ్ చేయబోయేది మరెవరో కాదు రాయ్ లక్ష్మి (లక్ష్మి రాయ్). ప్రస్తుతం ఈ రిహార్సల్స్ లో పవన్ పాల్గొంటున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఓ పాట అదిరిపోనుందని, ఆ పాట పెద్ద హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ నానక్ రామగూడ లో ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఈ పాట కోసం ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మకడలి సెట్స్ వేస్తున్నారు.

kalyan

సర్దార్‌తో రాయ్‌ లక్ష్మిపవన్‌కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొంది రాయ్‌ లక్ష్మి. పవన్‌ హీరోగా నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో ఓ కీలక పాత్రతో పాటు, ప్రత్యేక గీతం చేయబోతోందామె. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించింది రాయ్‌ లక్ష్మి

. 'కాంచనమాల కేబుల్‌టీవీ'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాలు చేసింది. ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి. లక్ష్మీ రాయ్‌గా పరిచయమైన ఆమె కొంతకాలం క్రితమే తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకొంది.

పవన్‌తో కలిసి నటించే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో హీరోయిన్ గా ఇప్పటికే కాజల్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవ్వబోతోంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

kalyan0

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ నుంచి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ జయనేని విన్సెంట్ బయిటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బయటకు రావటానికి కారణం ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
Sardaar's next schedule will commence on 30th September with a item song, featuring Raai Lakshmi. Pawan will also take part in the song's shoot and he is currently undergoing rehearsal sessions.
Please Wait while comments are loading...