For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో ‘సరిలేరు’కే అడ్వాంటేజ్.. మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తున్న ట్రేడ్ అంచనాలు.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరూ ప్రస్తుతం తలో సినిమాతో బిజీగా ఉన్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా మహేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న 'అల.. వైకుంఠపురములో' ద్వారా బన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు.

  భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నవే కావడంతో ఈ రెండు సినిమాలపై అంచనాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఏ సినిమా హిట్ అవుతుందన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాకు ఓ విషయంలో పైచేయి సాధించిందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  సరిలేరు అనిపించుకుని హ్యాట్రిక్ చేస్తాడట

  సరిలేరు అనిపించుకుని హ్యాట్రిక్ చేస్తాడట

  సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టేందుకు అనిల్ రావిపూడితో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. అతడు ఆర్మీ మేజర్‌గా కనిపించబోయే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. అలాగే, విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేస్తున్నారు.

   వైకుంఠపురములో చాలా మంది ఉన్నారు

  వైకుంఠపురములో చాలా మంది ఉన్నారు

  ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వస్తున్నదే ‘అల.. వైకుంఠపురములో'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని, మురళీ శర్మ, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

  అందులో రెండు సినిమాలూ తగ్గట్లేదు

  అందులో రెండు సినిమాలూ తగ్గట్లేదు

  ఈ రెండు సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఆ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను ప్రారంభించేశాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాల నుంచి వస్తున్న ప్రతి దానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. వీటి నుంచి ఏది వచ్చినా రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  ఆ విషయంలో ‘సరిలేరు'కే అడ్వాంటేజ్

  ఆ విషయంలో ‘సరిలేరు'కే అడ్వాంటేజ్

  సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమాల గురించి ఓ ఆసక్తికరమై చర్చ టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. దీని ప్రకారం.. జనవరి 11న వస్తున్న సరిలేరుకు కొంచెం అడ్వాంటేజ్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీనికి కారణం ‘అల' కంటే ఒకరోజు ముందు ఈ సినిమా రావడమేనని చెబుతున్నారు. దీంతో ఓపెనింగ్స్ మహేశ్‌కే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

  ట్రేడ్ అంచనాలతో మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన

  ట్రేడ్ అంచనాలతో మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన

  తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఓవర్సీస్‌లో మహేశ్‌కు భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. ఇప్పటికే ఆయన నటించిన ఎన్నో సినిమాలు మిలియన్ మార్కును అందుకున్నాయి. అందుకే ‘సరిలేరు' సినిమా టికెట్ అక్కడ 21 డాలర్లుగా ఫిక్స్ చేసేశారట. దీంతో తొలిరోజు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉందట. ఈ లెక్కలు తెరపైకి రావడంతో మెగా ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారని టాక్.

  English summary
  Two Telugu States and in Overseas region are eagerly waiting for two films, Sarileru Neekevvaru and Ala Vaikunthapurramuloo, which are set for Jan 11th and 12th release. And with Mahesh Babu's film coming a day in advance, trade circuits are stressing that there will be a huge advantage for the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X