సరిలేరు నీకెవ్వరు: అర్ధరాత్రి ఒంటిగంట నుంచే అభిమానుల కోలాహలం
గత అర్థరాత్రి నుంచి ఏ ఏరియాలో చూసినా మహేష్ బాబు అభిమానుల కోలాహలమే కనిపిస్తోంది. ఆయన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' నేపథ్యంలో అర్థరాత్రి వేళ థియేటర్లన్నీ జనంతో పోటెత్తాయి. ప్రీమియర్ షోస్ చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈలలు, కేకలు పెడుతూ హోరెత్తించారు.
అర్థరాత్రి నుంచి మొదలుకొని ప్రతీ గంటకు థియేటర్స్ వద్ద అభిమానుల తాకిడి పెరుగుతూ వస్తోంది. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డేనే చూడాలని జనం ఆతృతగా థియేటర్ల బాట పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో వేచి చూస్తున్నారు ప్రేక్షకులు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, వైజాగ్ సిటీలో అర్థరాత్రి ఒంటిగంటకు మహేష్ అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున కనిపించింది. వేళ సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి తరలి వచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు భారీ డిమాండ్ కనిపించింది. అలాగే వైజాగ్ సంగం థియేటర్ ఆర్చ్‌ని భారీ హంగులతో మహేష్ బ్యానర్లతో తీర్చిదిద్దారు.
మరోవైపు ప్రీమియర్స్ ద్వారా సరిలేరు నీకెవ్వరు సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అభిమానుల తాకిడి మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పైగా సంక్రాంతి సెలవులు, శనివారం కాబట్టి ఈ రోజు థియేటర్లన్నీ మహేష్ బాబు అభిమానులతో కళకళలాడటం ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











