Just In
- 7 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 13 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 29 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 1 hr ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
Don't Miss!
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు: రాములమ్మ పవర్‌ఫుల్ రీ ఎంట్రీ.. చెంప చెల్లుమంది
సూపర్ స్టార్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. మహేష్ బాబు ఎప్పుడెప్పుడా అని చూసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ రోజు (జనవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గత అర్థరాత్రి నుంచే ఈ సినిమా పలుచోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. ఈ షోలకు విశేష ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాలో విజయశాంతి రోల్ కీలకం కావడంతో ఈ రోల్ ఎలా ఉందనే దానిపై ప్రేక్షకులు స్పందిస్తున్నారు. వివరాల్లోకి పోతే..

విజయశాంతి రీ ఎంట్రీ.. గొప్ప ప్రాధాన్యం
ఒకప్పుడు తెలుగు సినీ తెరపై లేడీ అమితాబ్‌గా కీర్తించబడిన విజయశాంతి.. దాదాపు 13 ఏళ్ల సినీ విరామం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి కోరిక మేరకు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ రెంటరీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు అనిల్.

ఆడియన్స్ టాక్.. విజయశాంతి రోల్
టీజర్, ట్రైలర్స్ లో చూపించిన విధంగానే విజయశాంతి రోల్ కీలకంగా ఉందని అంటున్నారు. దర్శకుడు అనిల్‌రావిపూడి సినిమా మొదటి సన్నివేశమే విజయశాంతితో స్టార్ట్ చేశాడు. విలన్ కొడుకు తాగి కాలేజ్‌కు వస్తాడు, బాగుంది కదా అని అమ్మాయిని ఏడిపిస్తాడు.. ఆమె చెంపమీద కొడుతుంది. ప్రిన్సిపల్ దగ్గరకు వెళుతుంది.

రాములమ్మ పవర్‌ఫుల్ ఎంట్రీ.. రీ ఎంట్రీ
ఈ సీన్ తో రాములమ్మ పవర్‌ఫుల్ ఎంట్రీతో రీ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు ప్రేక్షకులు. ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి రోల్ ఆకట్టుకుందని టాక్ నడుస్తోంది. విజయశాంతి రీ ఎంట్రీ ఈ సినిమాకు బాగానే కలిసొచ్చే అంశమని చెప్పుకుంటున్నారు జనం.

ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు
మరోవైపు ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. ఆయన యాక్షన్ సీన్స్ సూపర్ అంటున్న ప్రేక్షకులు, కామెడీ టైమింగ్ కూడా బాగుందని చెబుతున్నారు. ఈ సంక్రాంతికి సూపర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిందని అంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు విశేషాలు
దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన సరిలేరు నీకెవ్వరు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు.