»   » ‘సరైనోడు’ లోకేషన్లో సందడే సందడి (ఫోటోస్)

‘సరైనోడు’ లోకేషన్లో సందడే సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ నేడు విడుదల చేయబోతున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ తో సినిమా పబ్లిసిటీ మరింత ఉదృతం చేయబోతున్నారు.

['సరైనోడు' టీజర్ డైలాగు లీక్]

ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

[సునీల్ కు కథ ఇవ్వటమే కాకుండా.. సాయింగా వస్తున్న బన్నీ]

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. షూటింగులో అందరూ ఎంతో సందడిగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న రిషి పంజాబి అందరితో సెల్ఫీ తీసుకుంటూ సందడిగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

 బన్నీతో..

బన్నీతో..

చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ తో సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి.

బోయపాటితో..

బోయపాటితో..

దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి.

రాజమండ్రిలో..

రాజమండ్రిలో..

రాజమండ్రిలో షూటింగ్ సందర్భంగా తన టీంతో కలిసి సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి.

 బన్నీ, భాను మాస్టర్

బన్నీ, భాను మాస్టర్

సరైనోడు సినిమా సెట్స్ లో అల్లు అర్జున్, భాను మస్టార్.

విద్యు రామన్

విద్యు రామన్

హాస్య నటి విద్యు రామన్ తో కలిసి అల్లు అర్జున్

టీజర్

టీజర్

సరైనోడు ఫస్ట్ టీజర్ నేడు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసారు.

English summary
Sarrainodu teaser releasing today. "While the 30 seconds teaser will be officially unveiled on Thursday, it will be screened in theatres the next day. Usually, only trailers are released in theatres but the makers have made an exception with this project," a source from the film's unit said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu