»   » ప్రసవ వేదన, బోయపాటి హీట్ బన్నీని మింగలేదు: అరవింద్ వ్యాఖ్య

ప్రసవ వేదన, బోయపాటి హీట్ బన్నీని మింగలేదు: అరవింద్ వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్ ట్రెసా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం స‌రైనోడు. అల్లు అర‌వింద్ నిర్మాత‌. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతున్న నేపథ్యంలో హైద‌రాబాద్‌లో బుధ‌వారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆది పనిశెట్టి, తమన్, సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. బోయ‌పాటి స్టైల్లోని హీట్ ఉంటుంది. అయితే ఆ హీట్ బ‌న్నీని మింగ‌లేదు. ఆయ‌న సినిమాల్లోని హీట్ ను ఉంచుతూనే బ‌న్నీని బ‌న్నీగా చూపించారు. బ‌న్ని, బోయ‌పాటి ఇప్పుడు ప్ర‌స‌వ వేద‌న‌ను అనుభ‌విస్తున్నారు. నేను మాత్రం వ‌రండాలో తండ్రి ప‌చార్లు చేస్తున్న‌ట్టు చేస్తున్నాను అంటూ కామెంట్ చేసారు.

బన్నీ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్డ్ చిత్ర‌మిది. సాంకేతిక‌ప‌రంగా కొత్త‌గా ఉంటుంది. మ‌న సినిమాలు సాంకేతికంగా హిందీ చిత్రాల‌తో స‌రితూగ‌డం లేదు అనుకునేవారికి ఈ సినిమా స‌మాధాన‌మ‌వుతుంది అన్నారు. రిషి పంజాబీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేశారు. 500ల‌కు పైగా యాడ్ ఫిల్మ్స్ చేసిన ఆయ‌న ప‌నితీరు న‌చ్చి బ‌న్ని ఈ సినిమాకు ఎంపిక చేశారని అరవింద్ తెలిపారు.

బోయ‌పాటి మాట్లాడుతూ...

బోయ‌పాటి మాట్లాడుతూ...


నా చేతికి మైక్ టైస‌న్‌ని ఇస్తే అత‌నికి ఇంకా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి మంచి బాక్సింగ్ సినిమా చేస్తా. మైకిల్ జాక్స‌న్‌ని ఇస్తే మంచి డ్యాన్స్ సినిమా చేస్తా. నా హీరోకి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ ప్ర‌కారం చేస్తా. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ జోన‌ర్‌లో చేస్తా. అంద‌రు హీరోల‌తో సినిమా చేయ‌డానికే నేను ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను అన్నారు.

బోయపాటి అలా అనడం వెనక..

బోయపాటి అలా అనడం వెనక..


సాధారణంగా బోయపాటి దర్శకత్వం అంటే ఈ సినిమా బన్నీ స్టైల్ లో ఉండదేమో.... సింహా, లెజెండ్ స్టైల్ లో ఉంటుందేమో అని అంతా భావిస్తున్నారు. అందుకే బోయపాటి ఈ విధంగా మాట్లాడారు.

గుండెల మీద చేయివేస్కోండి

గుండెల మీద చేయివేస్కోండి


వెనుక బ‌రువునంతా వేసుకుని నేను ఇంజిన్‌లాగా వెళ్తున్న‌ప్ప‌టికీ , నాకు ట్రాక్‌లాగా నిలిచి స‌పోర్ట్ చేసిన నిర్మాత‌ను మ‌ర్చిపోలేను. గుండెల‌మీద చెయ్యి వేసుకుని అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది`` అని అన్నారు. బోయాపటి తన గత సినిమాల విషయంలోనూ ఇలానే గుండెల మీద చేయివేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. బహుషా ఇది బోయాపటి ఊత పదం ఏమో!

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ


యాక్ష‌న్‌, ఎమోష‌న్ ఉన్న సినిమా ఇది. ఎమోష‌న్ అనే వెన్నెముక‌కు రొమాన్స్, డ్రామా, ఫ్యామిలీ వంటి అంశాల‌తో పూత వేశారు. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. చిన్న డీటైల్స్ కూడా మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు చెప్పేవారు. ఆయ‌న ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ గ్రేట్‌ అని రకుల్ తెలిపారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ..

ఆది పినిశెట్టి మాట్లాడుతూ..


ఊర మాస్ ఓపెనింగ్స్ రానున్న సినిమా ఇది. మామూలుగా సినిమాప‌ట్ల ఎక్స్ పెక్టేష‌న్స్ పెరుగుతుంటే భ‌యం ఉంటుంది. కానీ ఈ సినిమా ప‌ట్ల నాకు అలాంటి భ‌యాలేమీ లేవు. హీరోగా చేస్తున్న నువ్వు విల‌న్‌గా ఎందుకు మారావు అని చాలా మంది అడుగుతున్నారు. వారంద‌రికీ ఈ సినిమా ఓ స‌మాధాన‌మ‌వుతుంది`` అని చెప్పారు.

English summary
Photos of Telugu Movie Sarrainodu Press Meet event held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu