»   »  సరైనోడు: బన్నీ రొమాంటిక్ యాంగిల్ అదరహో... (ఫోటోస్)

సరైనోడు: బన్నీ రొమాంటిక్ యాంగిల్ అదరహో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు.

ఈ చిత్రంలో బన్నీ ఇద్దరు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సంగ్, కేథరీన్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. సాధారణంగా బోయపాటి సినిమాలంటే యాక్షన్ సీన్లు మాత్రమే కళ్ల ముందు మొదులుతాయి. కానీ 'సరైనోడు'లో యాక్షన్ పార్టుతో పాటు రొమాంటిక్ పార్టుకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడట.

హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లతో బన్నీ చేసే రొమాంటిన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. తాజాగా వీరిపై విడుదల చేసిన పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు మరింత పెచుతోంది.

ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ మెచ్చేలా సినిమా ఉండబోతోంది. నిర్మాత మాట్లాడుతూ....ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అన్నారు.

బన్నీ జాగ్రత్త పడ్డాడు

బన్నీ జాగ్రత్త పడ్డాడు


సాధారణంగా బోయపాటి సినిమాలంటే రక్తపాతం ఎక్కువగా ఉంటుంది. అయితే బన్నీ ముందు నుండి అలాంటి సీన్లు సినిమాలో ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడ్డారు.

సెన్సార్

సెన్సార్


సెన్సార్ నుండి A సర్టిఫికెట్ వస్తే ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం అవుతారనే భయంతోనే బన్నీ బోయాపాటిని కంట్రోల్ లో పెట్టాడు. ఆ ఫలితంగానే ఈ చిత్రానికి సెన్సార్ నుండి U/A సర్టిఫికెట్ వచ్చింది.

ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి

ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి


ఇటీవల విడుదలైన సరైనోడు ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచింది.

రిలీజ్

రిలీజ్


ఈ నెల 22న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Allu Arjun's Sarrainodu romantic scenes to entertain fans. The movie has been passed by the regional Censor Board. The CBFC has cleared the film with U/A. With this, the film is all set for grand gala release world-wide on April 22nd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu