»   » సరైనోడు: డివైడ్ టాక్ వల్లే బన్నీ రెచ్చిపోయాడు (ఫోటోస్)

సరైనోడు: డివైడ్ టాక్ వల్లే బన్నీ రెచ్చిపోయాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు కాస్త డివైడ్ టాకే వచ్చింది. రివ్యూలు కూడా ఈ సినిమా గురించి గొప్పగా ఏమీ రాలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ సినిమా అయినా డీలా పడటం ఖాయం. అయితే 'సరైనోడు' చిత్రం మాత్రం ఊహించని విధంగా పుంజుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇలాంటి పరిస్థితికి కారణం.... సరైనోడు చిత్రానికి బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాల పోటీ ఏమీ లేక పోవడమే. తొలి రెండు వారాలు ప్రేక్షకులకు బాక్సాఫీసు వద్ద 'సరైనోడు' తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు. మరో వైపు బన్నీ కూడా ప్రమోషన్స్ విషయంలో తనదైన రేంజిలో రెచ్చిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ నిర్వమించారు.

దీంతో ఈ స‌మ్మ‌ర్ లో 2106 లొనే టాప్ గ్రాస‌ర్ గా, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేస్తూ... ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరింది ఈ చిత్రం. ఇటీవ‌లే విజయవాడలో బాక్సాఫీస్ ఫంక్ష‌న్ పేరిట వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలొ కలర్ ఫుల్ గా అంగ‌రంగ వైభవంగా జ‌రిపిన విష‌యం తెలిసిందే. అంతకు ముందు వైజాగ్ లో కూడా భారీ ఈ వెంట్ నిర్వహించారు.

నిరూపించాడు

నిరూపించాడు


మంచి కంటెంట్ ఉండి. ప్ర‌మెష‌న్స్ బాగా చేస్తే మంచి వసూళ్లు సాధించ వచ్చని స‌రైనోడు చిత్ర టీం నిరూపించారు.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి


ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో భాగంగా అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీనుతో పాటు హీరో హీరోయిన్లు, ఇతర తారాగణంతో మరో ఈవెంట్ నిర్వహించారు.

వసూళ్లు బావున్నాయి

వసూళ్లు బావున్నాయి


‘సరైనోడు' చిత్రానికి అన్ని వసూళ్లు బావున్నాయి. అయితే తాజాగా 24, సుప్రీమ్ చిత్రాలు విడుదల కావడంతో జోరు తగ్గింది.

వివాదాలు, అనుమానాలు

వివాదాలు, అనుమానాలు


అయితే సరైనోడు చిత్రంపై కొన్ని అనుమానాలు, వివాదాలు కూడా ఉన్నాయి. కలెక్షన్లు కావాలనే ఎక్కువ చేసి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

సొంత బేనర్ కాబట్టే..

సొంత బేనర్ కాబట్టే..


తన సొంత బేనర్లో తెరకెక్కిన సినిమా కాబట్టే బన్నీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు.

English summary
Check out photos of Sarrainodu team with Family audience and fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu