చంపేస్తామని బెదిరింపులు: ప్రధాని మోడీకి కట్టప్ప కూతురు లేఖ!
నటుడు సత్యరాజ్ కూతురు మోడీకి ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీ వారు తనను బెదిరించినట్లు తెలిపారు.
బాహుబలి కట్టప్ప, నటుడు సత్యరాజ్ కూతురు దివ్య.... ప్రధాని మోడీకి లెటర్ రాయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఆ లేఖలో తనను కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించారని ఆమె తెలిపారు.
అమెరికాకు చెందిన ఓ ఫార్మా సంస్థ తయారుచేసిన టాబ్లెట్‌లో విటమిన్ల ఓవర్‌డోస్ ఉన్నట్లు, దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించిన న్యూట్రీషనిస్ట్ దివ్య వాటిని తన పేషెంట్లకు సిఫారసు చేయడానికి తిరస్కరించారు.

ఈ విషయం తెలుసుకున్న సదరు ఫార్మా సంస్థకు చెందిన ప్రతినిధులు రంగంలోకి దిగి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని, అందుకు ఆమె నిరాకరించడంతో చంపుతామని బెదిరించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని ఊరికే వదిలేస్తే చాలా డేంజర్ అని భావించిన దివ్య... ఈ విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫార్మా సంస్థ కు సంబంధించిన వివరాలు, వారి మందుల వల్ల జరిగే ప్రమాదం, తనను బెదిరించిన విషయాన్ని వివరంగా ఆమె తన లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











