»   » బాహుబలి-2 కోసం కట్టప్ప భారీ చాన్స్ వదులుకున్నాడు

బాహుబలి-2 కోసం కట్టప్ప భారీ చాన్స్ వదులుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఇంటర్నెట్లో గతకొంత కాలంగా వైరల్ వ్యాపించింది. బాహుబలి పార్ట్ 2పై అంచనాలు పెరిగేలా చేయడంలోనూ కటప్ప పాత్ర కీలకంగా మారింది.

కటప్ప పాత్ర పోషించి నటుడు సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి పార్ట్ 2లో కటప్ప పాత్ర కీలకం కానుంది. బాహుబలి పార్ట్ 2 కోసం కట్టప్ప ముందస్తుగానే 100 రోజుల డేట్స్ ఇచ్చేసాడు. ఈ కారణంగా ఆయన తమిళ స్టార్ విజయ్ 59వ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.


Sathyaraj to set aside over 100 days for 'Baahubali 2'

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' రూ. 500 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫోర్బ్స్ కథనం ప్రకారం...ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి.


‘బాహుబలి' తొలి భాగం చూసిన ప్రేక్షకులు.... రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయింది. మిగతా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. 2016లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Veteran Tamil actor Sathyaraj, who won critical acclaim for his performance as the loyal warrior Kattappa in S.S. Rajamouli’s ‘Baahubali’, has been asked to allocate over 100 days for the shoot of the remaining portion of the second part of the franchise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu