Don't Miss!
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన వారిలో సత్యదేవ్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి సోలో హీరోగా మారిన అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గుర్తుందా శీతాకాలం' అనే ఫీల్ గుడ్ మూవీతో వచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూపై లుక్కేద్దాం పదండి!

గుర్తుందా శీతాకాలంగా అంటూనే
సత్యదేవ్ హీరోగా నాగశేఖర్ తెరకెక్కించిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాను భావనా రవి, నాగశేఖర్, రామారావులు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించింది. కాల భైరవ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇది లవ్ మాక్‌టైల్ మూవీకి రీమేక్‌గా వచ్చింది.
పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

లవ్ స్టోరీలు.. రొమాన్స్, ఎమోషన్
ఎప్పటికప్పుడు
వినూత్నమైన
చిత్రాలను
ప్రేక్షకులకు
అందించాలనే
లక్ష్యంతో
కనిపించే
సత్యదేవ్
ఇప్పుడు
'గుర్తుందా
శీతాకాలం'
అనే
సినిమాను
చేశాడు.
తన
పాత
ప్రేమకథలను
చెబుతూ
సాగే
కథతో
ఈ
సినిమా
రూపొందింది.
ఇందులో
కావాల్సినంత
ఫన్‌తో
పాటు
ఎమోషన్
ఉంటుందని
చిత్ర
యూనిట్
చెప్పింది.
ముఖ్యంగా
సత్యదేవ్,
తమన్నా
రొమాన్స్
హైలైట్
కాబోతుందట.

సత్యదేవ్ మూవీకి అలాంటి టాక్
విలక్షణ నటుడు సత్యదేవ్ - తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా పర్వాలేదనేలా ట్వీట్లు చేస్తున్నారు.
యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'గుర్తుందా శీతాకాలం' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడం, ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళ్లడం చేశారట. ముఖ్యంగా హీరో తన కథలను చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఆకట్టుకుంటాయని తెలిసింది. ఇక, ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్‌గా ఉంటుందట. అయితే, సెకెండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతూ శాడ్ ఎండింగ్‌తో ముగుస్తుందని తెలిసింది

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇలా
'గుర్తుందా శీతాకాలం' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో సత్యదేవ్, తమన్న నటన, కెమిస్ట్రీ అదిరిపోతుందట. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, ద్వితియార్థంలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవడం, కొంత నెమ్మదిగా సాగడం దీనికి మైనస్‌లుగా మారాయని వీక్షకులు చెప్తున్నారు.
బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే!
ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఎమోషనల్‌గా సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అని చెప్పొచ్చు. సరద సరదాగా సాగుతూ గుండెను హత్తుకునే క్లైమాక్స్‌తో సినిమా రకరకాల ఎమోషన్స్‌ను పంచుతుందట. ఇందులో అన్ని వర్గాల వాళ్లకూ నచ్చే అంశాలు మెండుగానే ఉన్నాయట. కానీ, ఎంత వరకూ రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది.

మరి సత్యదేవ్ హిట్ కొట్టాడా అంటే
ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. సత్యదేవ్ నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీలో అతడిని ఇష్టపడే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెచ్చే అంశాలు ఇందులో ఉన్నాయట. కాబట్టి వాళ్లను థియేటర్లకు రప్పించుకోగలిగే టాక్ వస్తే మాత్రం ఈ మూవీకి కలెక్షన్లు వచ్చి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.