twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిమజ్జనం చేసిన దేవిశ్రీప్రసాద్.., విగ్రహం ఏర్పాటు

    By Srikanya
    |

    రాజమండ్రి : ఇటీవల కన్ను మూసిన తన తండ్రి సత్యమూర్తి (ప్రముఖ రచయిత) అస్తికలను రాజమండ్రిలోని గోదావరి నదిలో ఈరోజు నిమజ్జనం చేశారు ప్రముఖ సంగీత దర్శకులుదేవీశ్రీ ప్రసాద్‌. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ లో కర్మకాండ శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఈ నిమజ్జనం చేసారు. ఈ సందర్బంగా కలిసిన లోకల్ మీడియాతో ఆయన మాట్లాడారు.

    దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక తమ స్వగ్రామమని అన్నారు. అలాగే...మానాన్న సత్యమూర్తికి తాను పుట్టిపెరిగిన గోదావరి తీరమంటే ప్రాణమని' అని చెప్పుకొచ్చారు.

    Satyamurthy ashes immersed at Godavari

    ఇక తన తండ్రి ఆయన తల్లితండ్రుల కోసం సూర్యోదయం పేరుతో గృహాన్ని నిర్మించినట్లు చెప్పారు. మే24న తన తండ్రి సత్యమూర్తి పుట్టినరోజు కావడంతో వెదురుపాకలోని తమ స్వగృహంలో వేడుకలు నిర్వహించి ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.

    తన తండ్రి అస్తికలను గోదావరితో పాటు గంగానది సహా పలు నదుల్లో నిమజ్జనం చేయనునట్లు తెలిపారు. దేవీశ్రీప్రసాద్‌తో పాటు అతని సోదరుడు సాగర్‌ ఉన్నారు.

    Satyamurthy ashes immersed at Godavari

    సత్యమూర్తి... రచయితగా పనిచేసిన తొలిచిత్రం ‘దేవత'. చంటి, ఛాలెంజ్‌, భలేదొంగ, అభిలాష, పెదరాయుడు, ఖైదీ నంబర్‌ 786 లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు.

    English summary
    Music Director Devi Sri Prasad And His brother Singer Sagar had Immersion his father Ashes in Godavari River Today in Kotilingala Ghat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X