»   » అంత పిచ్చివాడు,మూర్ఖుడు ఉండడు, నాగార్జున నటుడుగానే కాదు.... అంటూ చెప్పాడు

అంత పిచ్చివాడు,మూర్ఖుడు ఉండడు, నాగార్జున నటుడుగానే కాదు.... అంటూ చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవేంద్రరావుగారి 'నమో వెంకటేశాయ' సినిమా గురించిన వివరాలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ సినిమాలో వేంకటేశుని పాత్ర పోషించిన సౌరభ్‌ జైన్‌ ఇప్పుడో కొత్త విషయం బయటపెట్టాడు. ఉత్తరాదిన శ్రీకృష్ణుడు, రాముడు లాంటి పాత్రలు పోషించిన అనుభవం సౌరభ్‌కు ఉంది.

అందుకే రాఘవేంద్రరావుగారు ఈసారి సుమన్‌కి కాకుండా సౌరభ్‌కు అవకాశం ఇచ్చారు. అన్నమయ్య.. శ్రీరామదాసు.. రాఘవేంద్రరావు తీసిన ఈ రెండు ఆధ్యాత్మిక చిత్రాల్లో దేవుడి పాత్ర పోషించింది సుమన్. ఐతే 'ఓం నమో వేంకటేశాయ'కు మాత్రం సుమన్ ను కాదని.. ఉత్తరాది నటుడు సౌరభ్ జైన్ ను ఎంచుకున్నాడు రాఘవేంద్రుడు. ఐతే రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు సౌరభ్ విషయంలో అంత ఆసక్తి చూపిస్తే.. అతను మాత్రం ఈ సినిమా చేయడానికి ముందు నో అనేశాడట. ఈ పాత్ర చేయడానికి భయపడ్డాడట.

ఇదంతా ఒక ఎత్తయితే రాఘవేంద్రరావుగారి నుంచి ఫోను వచ్చినప్పుడు ఈ సినిమా చేయకూడదన్న నిర్ణయంతోనే ఇక్కడకు వచ్చాడట! కానీ కథ విన్న తరువాత తన నిర్ణయం మార్చుకున్నాడట! ఇక్కడకు రాకుండా ఈ పాత్రకు నో చెప్పి ఉంటే తన కెరీర్‌లో ఓ మంచి సినిమాను కోల్పోయేవాణ్ణి. ఆ బాధ జీవితాంతం వెంటాడేది అంటూ చెప్పుకొచ్చాడు.

Saurabh Jain gets golden offer in Namo venkatesa

ఇదివరకే సీరియళ్లలో శ్రీకృష్ణుడు.. విష్ణువు పాత్రలు చేశాను. మళ్లీ ఆ తరహా పాత్రలు చేయాలంటే ఎందుకో భయపడ్డా. నాపై ఇలాంటి ముద్రే పడిపోతుందనుకొన్నా. అందుకే 'నో' చెప్పేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు స్వయంగా మాట్లాడి నన్ను హైదరాబాద్ కు పిలిపించారు. ఒకసారి కథ.. పాత్ర గురించి విని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని అన్నారు. రాఘవేంద్రరావు గారితో పాటు నాగార్జున.. గోపాల్ రెడ్డిలతో సమావేశమయ్యాను.

వాళ్లు ఇచ్చిన నరేషన్ విన్నాక ఎలాంటి సినిమా తీయబోతున్నారో.. నా పాత్ర ఎలా ఉంటుందో అర్థమైంది. ఈ సినిమాని వదులుకొంటే నా అంత పిచ్చివాడు.. మూర్ఖుడు ఉండడు అనిపించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకున్నా. మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన లెజెండ్‌ ఆయన. లైఫ్‌ టైమ్‌లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం.

వర్క్‌ పట్ల పాషన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ వయసులో కూడా ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా క్లారిటీతో ఓ సీన్‌ను ఎలా చేయాలో అలా నటీనటుల నుండి రాబట్టుకుంటారు. నాగార్జున నటుడుగానే కాదు, వ్యక్తిగా కూడా ఎలా ఉండాలో ఆయన నుండి నేర్చుకున్నాను. చాలా పెద్ద స్టార్‌ అయినా కలిసిపోయే తనం, ఇతరులను గౌరవించే విధానం ఆకట్టుకున్నాయి. ముందు భాష విషయంలో ఇబ్బంది పడ్డా.. ముందు భాష ఇబ్బందిగా అనిపించినా, డైరెక్టర్‌గారు ట్యూటర్‌ని పెట్టించడంతో ఈజీ అయింది అంటున్నాడు.

English summary
saurab Raj Jain who is playing a Role as Lord Venkateswara in Raghavendra Rao's New Movi with Nagarjuna as Hathiram baba.. Shared Some movements in a Latest interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu