»   »  నారా రోహిత్ ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడు (సావిత్రి ట్రైలర్)

నారా రోహిత్ ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడు (సావిత్రి ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌, నందిత హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. పవన్‌ సాదినేని దర్శకత్వంలో, విజన్‌ ఫిలింమేకర్స్ పతాకంపై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సారి రోహిత్ హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు ఈ ట్రైలర్ చూసిన వారు.

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి (వీడియో)

ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, రోహిత్‌, నందితల కాంబినేషన్‌ ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుందని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' చిత్రంతో మంచి గుర్తింపు లభించిందని, ఇప్పుడు నారా రోహిత్‌తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్‌ ఫామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శకుడు పవన్‌ సాదినేని తెలిపారు. రోహిత్‌ పెర్ఫామెన్స్ లో, బాడీ లాంగ్వేజ్‌లో ఎంతో కొత్తదనం ఉంటుందన్నారు.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

'బాణం' చిత్రం నుండి ఇటీవల విడుదలైన 'అసుర' చిత్రం వరకు విభిన్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ 'సావిత్రి' చిత్రంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. షూటింగ్పూ ర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం. మార్చి 25న 'సావిత్రి' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు. సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ, ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కో డైరెక్టర్: సురేష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్సా దినేని.

English summary
Here's the Theatrical Trailer of Nara Rohit's upcoming love & family entertainer SAVITHRI. The Movie is directed by Pavan Sadineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu