»   » ‘గోపాలా గోపాలా’ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా?

‘గోపాలా గోపాలా’ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఈచిత్రానికి 'ఓరి దేవుడా', 'దేవ దేవం భజే' అనే టైటిల్స్ వినిపించాయి. చివరగా 'గోపాలా గోపాలా' టైటిల్ ఖరారు చేసారు. అయితే ఈ టైటిల్ ఫైనల్ చేయడం వెనక ఓ ఆసక్తికర కారణం కూడా ఉంది.

సినిమాలో వెంకీ పాత్ర పేరు గోపాల్. పవన్ పోషించేది కూడా గోపాలుడి(కృష్ణుడి) పాత్రే కాబట్టి 'గోపాల గోపాల' టైటిల్ ఫైనల్ చేసారు. అదన్నమాట సంగతి. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి

 Secret Behind 'Gopala Gopala' Title

హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో 'గోపాలా గోపాలా'గా తెరకెక్కిస్తున్నారు. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary

 According to film nagar sources in the Gopala Gopala movie unit, Venkatesh is called Gopal/Gopala Krishna in the movie. And it is known that Pawan Kalyan is playing lord Krishna who is popularly known as Gopala. Hence the title is set as Gopala Gopala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X