»   » ‘రేసు గుర్రం’ న్యూ పోస్టర్ కేక...!

‘రేసు గుర్రం’ న్యూ పోస్టర్ కేక...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా సురేంద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రేసు గుర్రం'. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. త్వరలో విడుదల కాబోతున్న ఈచిత్రం ప్రమెషన్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు నిర్మాతలు.

అందులో భాగంగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు విడుదల చేసారు. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసారు. సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ స్టైలిష్ స్టార్ ఇమేజ్‌ను రెట్టింపు చేస్తూ సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియోకు కూడా మంచి స్పందన వస్తోంది.

See picture: Allu Arjun's Race Gurram new poster

సినిమా మొత్తాన్ని పూర్తి వినోదాత్మక చిత్రంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ అయిన కామెడీ, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీటవేసాడని తెలుస్తోంది. అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయని సమాచారం.

ఈ చిత్రంలో టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం మరోసారి తన కామెడీతో అలరించనున్నాడు. ఆయన పాత్ర విషయానికొస్తే ఈ చిత్రంలో ఆయన అల్లు అర్జున్ పక్కన ఉండే పోలీసు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
Allu Arjun's Race Gurram new poster. Race Gurram is an upcoming Telugu family drama film directed by Surender Reddy starring Allu Arjun, Shruti Haasan, Saloni Aswani and Shaam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu