»   » పవన్ కళ్యాణ్ ‘జన సేన’ వైజాగ్ మీటింగ్ డెమో (వీడియో)

పవన్ కళ్యాణ్ ‘జన సేన’ వైజాగ్ మీటింగ్ డెమో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ ఈ నెల 27వ తేదీన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడి పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయి.

ఈ సభకు దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 'యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో సాగే ఈ భారీ బహిరంగ సభ....27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సభలో పార్టీకి సంబంధించిన విధి విధానాలు, లక్ష్యాలు, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరిస్తారు.

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే మీటింగుకు సంబంధించిన డెమో వీడియో విడుదలైంది. స్టేడియంలో ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు, ఎవరు ఎక్కడ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఏ ప్రదేశం నుండి ప్రసంగిస్తారు అనే అంశాలు ఈ డెమో వీడియోలో స్పష్టంగా ఉంది. మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/3oAYCrBbzns?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Jana Sena Party's Youth Meeting at Indira Priyadarshini Stadium in Visakhapatnam on March 27th. A demo video of the meeting has been unveiled Today to give a clarity to the people on seating arrangements at the Stadium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu