»   » నా బట్టలు కాదు మొహాన్ని కూడా చూడండి: సీరత్ కపూర్

నా బట్టలు కాదు మొహాన్ని కూడా చూడండి: సీరత్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Seerat Kapoor Gave Reply To Some Comments On Her Photo Shoot మొహాన్ని కూడా చూడండి

రెండేళ్ళకిందటవచ్చిన కొలంబస్ తర్వాత రెండేళ్ళు కనిపించకుండాపోయిన సీరత్ కపూర్ మళ్ళీ రాజుగారి గది 2 తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. . రాజు గారి గది 2 లో నాగార్జున సరసన సెలక్ట్ అవ్వటం తో అమ్మడి మొహం ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకి బాగానే తెలుస్తోంది. రాజుగారి గది రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటం తో ప్రమోషన్స్ లో భాగంగా కొద్దికొద్దిగా మాట్లాడుతోంది.

పనిలో పని నాగార్జున ని ఆకాశానికెత్తటం మాత్రం మర్చిపోవటం లేదు లెండి. ఆయనతో పనిచేయడం మాత్రం మరిచిపోలేనంటోంది. 'అంతటి స్టార్ హీరో అయినా, అందరినీ సమానంగా చూశారు. సెట్‌లో చాలా వినయంగా ఉండేవారు. సెట్‌లో ఉండే లైట్ బాయ్ నుండి అందరినీ ఎంతో గౌరవంగా పలకరించేవారని' కింగ్ నాగార్జున గురించి తెలిపింది సీరత్.

Seerat Kapoor about her latest Foto Shoot

అంతేకాదు ఈ మధ్య కాలం లో చేసిన ఒక ఫొటో షూట్ మీద విమర్శలు రావటం తో ఆ కామెంట్స్ కి సమాధానమూ, వివరణా ఇచ్చేసింది. నిజానికి ఆ ఫోటోషూట్స్ వెనుక ఉన్న బలమైన కాన్సెప్ట్ ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు. డిజైనర్ మంచి ఉద్దేశ్యంతో ఆ షూట్ చేశారు.


ఆ ఫోటోల్లోని ముఖంలో మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్ ఉంటుంది. అది కొంతమందికి మాత్రమే అర్థమైంది. నా ఫేస్‌లో ఉన్న ఫీలింగ్‌ని గుర్తుపట్టలేని కొందరు నా దుస్తులు చూసి రకరకాల కామెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు' అంటూ సీరత్ క్లియర్ చేసింది.

English summary
Seerat Kapoor who playing a Lead Lady in Rajugari Gadi 2 with Nagarjuna, Gave Reply to some Comments on her Latest Foto shoot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu