For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అచ్చమైన తెలుగు సినిమా..!(SVSC హైలెట్స్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ అచ్చమైన తెలుగు సినిమా వెల్లువరిసింది. హద్దులు దాటిన ప్రేమ పిచ్చి, అసభ్యమైన సన్నివేశాలు, భయం పుట్టించే హింసాత్మక సన్నివేశాలు, ద్వందార్థాలతో వచ్చే చండాలమైన డైలాగులు, బూతు సన్నివేశాలు తప్ప ఈతరం తెలుగు సినిమాల్లో ఇంతకు మించి ఇక ఏమీ ఉండదని, కుటుంబ సమేతంగా చూసే స్వచ్చమైన సినిమాలు ఇక రావేమో అని సగటు కుటుంబ ప్రేక్షకుడు ఆందోళన చెందుతున్న తరుణంలో....ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన అందమైన కథాంశం ఫ్యామిలీ ప్రేక్షక రంజక సినిమా మన ముందుకు వచ్చింది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.

  సినిమాలో కమర్షియల్ అంశాలకు పెద్ద పీఠవేయక పోయినా.....కుటుంబ సమేతంగా ఆనందించ దగ్గ సినిమా ఇది. అలా అని యూత్ కు నచ్చని అంశాలు లేనవి కాదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వాటికి కూడా తగిన స్థానం కల్పించారు. కాక పోతే రొటీన్ మహేష్ బాబు సినిమాలా ఉండాలని భారీ అంచనాలతో వెళితే మాత్రం కాస్త నిరాశ తప్పదు. అచ్చమైన తెలుగు కుటుంబ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళితే మీరు పూర్తి సంతృప్తి చెందుతారు.

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసే ప్రేక్షకులు తమ రియల్ లైఫ్ లో తమ చుట్టు జరిగే సన్నివేశాలను చూసిన అనుభూతిని పొందుతారు

  ఎమోషనల్ పెద్దన్నయ్య పాత్రలో విక్టరీ వెంకటేష్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంజలితో వెంకటేష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

  తమ్ముడి పాత్రలో మహేష్ బాబు బాగా ఆకట్టుకున్నాడు. గోదావరి జిల్లాల యాసతో మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సమంత-మహేష్ బాబుల మధ్య సీన్లు ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. మహేష్-వెంకటేష్ మధ్య అన్నదమ్ముల అనుబంధం సినిమాకు మెయిన్ హైలెట్

  ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయి పాత్రలో గుడ్ లుక్ తో అంజలి ఆకట్టుకుంది. ఆమెకు మరింత స్క్రీన్ ప్లేస్ ఉంటే తన యాక్టింగ్ స్కిల్స్ నిరూపించుకుని ఉండేది. ఆమె ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

  సమంత మరింత గ్లామరస్‌గా కనిపించి ప్రేక్షకుల మది దోచింది. రొమాంటిక్ సీన్లలో సమంత హావభావాలు గిలిగింతలు పెడతాయి.

  ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, మురళీ మోహన్, రోహిణి హట్టంగడి, రవిబాబు, తనికెళ్ల భరణి తదితరలు తమ తమ పాత్రలకు తగిన విధంగా, బ్రిలియంట్ గా నటించారు.

  టెక్నికల్ విషయానికొస్తే సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ బ్యాంగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి.

  కెవి గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్. కలర్ ఫుల్ అండ్ రిచ్ పిక్చరైజేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తెస్తాయి. శ్రీకాంత్ అడ్డాల రాసిన డైలాగులు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది.

  మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ట్రీట్. కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమా.

  బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

  నటీనటులు: మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు

  సంగీతం: మిక్కీజె మేయర్

  ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

  సినిమాటోగ్రఫీ: గుహన్

  ఫైట్స్: విజయ్

  నిర్మాత: దిల్ రాజు

  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగు తెరపై వెల్లు విరిసిన భారీ మల్టీ స్టారర్ కుటుంబ కథ చిత్రం అయిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. టాక్ కాస్త యావరేజ్ గా ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకులు స్లోగా మూవ్ అవతారు కాబట్టి పుంజుకునే అవకాశం ఉంది.

  English summary
  
 Seethamma Vakitlo Sirimalle Chettu is a good family entertainer and it is good treat to this Sankranthi. Watch the film with your entire family to celebrate Sankranthi together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X