»   » శేఖర్ కమ్ముల ఆమె అప్పు తీర్చి సినిమాలోకి తీసుకున్నాడు!

శేఖర్ కమ్ముల ఆమె అప్పు తీర్చి సినిమాలోకి తీసుకున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినా.... ఎప్పటికీ గుర్తుండిపోయేలా, మనసుకు హత్తుకుపోయే మంచి సినిమాలు తీసారు. ఆయన సినిమాలు ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేలా ఉంటాయి.

అంతే కాకుండా తన సినిమాల ద్వారా పలువురు కొత్త యాక్టర్స్ కు అవకాశం కల్పించారు కూడా. ఆయన ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయిన వారిలో నటి సత్య సత్య కృష్ణన్ ఒకరు. హస్కీ గొంతుతో చురుకైన నటనతో ఆకట్టుకునే ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన డాలర్ డ్రీమ్స్, ఆనంద్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయింది.

Sekhar Kammula Cleared Satya Krishnan Loan

సినిమాల్లోకి రాక ముందు సత్య కృష్ణన్ ఓ హోటల్ లో పని చేసేది. ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల తన సినిమాలో పాత్రకు సరిపోయేలా ఉండటంతో బలవంతంగా తీసుకొచ్చారట. రెమ్యూనరేషన్ ఇవ్వడానికి బదులు అప్పటికే ఆమెకు ఉన్న అప్పు మొత్తం తీర్చేసాడట.

Sekhar Kammula Cleared Satya Krishnan Loan

ఆనంద్ సినిమా తర్వాత సత్య కృష్ణన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. వదిన పాత్రలు, ఇతర పాత్రల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రోజుకు రూ.25 వేలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. శేఖర్ కమ్ముల బలవంతంగా మీద ఈ రంగం వైపు వచ్చినా ఇపుడు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాలన్నీ సత్య కృష్ణన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.

English summary
"Actually I've to quit my job at a hotel to act in Anand movie. So, Sekhar actually paid a pending loan of mine. To bring me to shoot, he cleared the loan, but otherwise we don't have anything like a pay check", revealed Satya Krishnan.
Please Wait while comments are loading...