»   » ఫిదా సెన్సార్ పూర్తి, జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

ఫిదా సెన్సార్ పూర్తి, జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో మెప్పించిన మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న చిత్రం ఫిదా. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని జూలై 21న విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా ...నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న మ‌రో ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫిదా. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్ ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందిందని తెలిపారు.


Sekhar Kammula & Mega Prince Varun Tej's 'Fidaa' Censor report

సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు సింగిల్ ఆడియో, వీడియో కట్ కూడా ఇవ్వ‌లేదు. మా బ్యాన‌ర్ లో వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా ఫిదా మూవీ ఉంద‌ని అభినందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను జూలై 21న విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌తి ఒక‌రు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసే సినిమా ఇది అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను అన్నారు.


Fidaa Fame Sai Pallavi Dance among the students
English summary
Sekhar Kammula & Mega Prince Varun Tej's film 'Fidaa' completed Censor formalities and get clean U certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu