twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాజెక్ట్ చైత్ర: చంద్రబాబు హెల్ప్ కోరిన శేఖర్ కమ్ముల

    By Bojja Kumar
    |

    Sekhar Kammula
    హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. మహిళల రక్షణ కోసం తాను రూపొందించిన ప్రాజెక్టు చైత్ర వివరాలను శేఖర్ కమ్ముల బాబుకు వివరించారు. శేఖర్‌కమ్ములతోపాటు, మధుర శ్రీధర్‌లు ప్రాజెక్టు చైత్రలో భాగంగా, మహిళలకు 24 గంటలపాటు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను రూపొందించారు.

    ఈ హెల్ప్‌లైన్‌కు ఎవరు ఫోన్ చేసి సమాచారమిచ్చినా అది వెంటనే పోలీస్, ఆసుపత్రి తదితర శాఖలకు ఏకకాలంలో చేరిపోతుందని శేఖర్ వివరించారు. వచ్చే ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోలో ఈ తరహా కార్యక్షికమం ప్రకటించడం ద్వారా మహిళలకు భద్రత పెరిగే అవకాశముందని తాను బాబుకు వివరించినట్లు తెలిపారు.

    శేఖర్ కమ్ముల సినిమా విషయానికొస్తే...ప్రస్తుతం శేఖర్ కమ్ముల 'అనామిక' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. హిందీలో రీమేక్ అయిన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    'అనామిక' చిత్రంలో టైటిల్ పాత్రలో నయనతార నటిస్తోంది. వైభవ్, పశుపతి, హర్షవర్ధన్ రాణె తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌. ఫిబ్రవరిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Sekhar Kammula has met TDP chief Chandrababu Naidu. Kammula has devised a set of programmes with the name ‘Project Chaitra' aimed at providing safety to women. The project brings about a 24-hour helpline that will be available to women round the clock. A single call to the helpline will alert police, hospital and other departments simultaneously, Kammula said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X