»   » కుక్కలు అంటూ... రోజా మొగుడు నోరు జారాడా?

కుక్కలు అంటూ... రోజా మొగుడు నోరు జారాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
RK Selvamani
హైదరాబాద్: సినీ నటి రోజా మొగుడు, తమిళ దర్శకుడు ఆర్.కె. సెల్వమణి జర్నలిస్టులపై నోరు జారాడని, వారినుద్దేశించి అవమాన కరంగా మాట్లాడాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెల్వమణి తీరుపై మీడియా వారు మండి పడుతున్నారు. ఈ వివాదానికి కారణం...జర్నలిస్టులను సెల్వమణి కుక్కలతో పోల్చడమే అని తెలుస్తోంది.

విరాల్లోకి వెళితే...సౌతిండియాలో వివిధ సినీ పరిశ్రమల్లో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన విషయాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం సెల్వమణికి కోపం తెప్పించిందట.

జర్నలిస్టులు తక్కువ సంఖ్యలో హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పోయిన సెల్వమణి....సినిమా ఫంక్షన్లయితే కుక్కల్లా వస్తారు, ఫోటోలు తీసుకుంటూ అంతా కవర్ చేస్తారు, ఇలాంటి ఫంక్షన్లకయితే రారు అంటూ నోరు జారినట్లు తెలుస్తోంది. సెల్వమణి ఇలా ప్రవర్తించడంపై జర్నలిస్టులు ఆగ్రహంగా ఉన్నారు.

సెల్వమణి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. లేక పోతే తాము ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెల్వమణి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పే అవకాశం ఉన్నట్లు టాక్. త్వరలోనే సెల్వమణి క్షమాపణ వార్త వినే అవకాశం ఉంది.

English summary
Actress Roja's husband and Tamil director RK Selvamani is in news for all the wrong reasons. In a recent Short Film Function, he abused the journalists by addressing them as dogs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu