»   » లేడీస్ టైలర్ ఫ్లేవర్ ఫ్యాషన్ డిజైనర్ తగ్గించడు : వంశీ (ఇంటర్వ్యూ)

లేడీస్ టైలర్ ఫ్లేవర్ ఫ్యాషన్ డిజైనర్ తగ్గించడు : వంశీ (ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

వంశీ తెలుగుసినిమాకి ఆకుపచ్చని చీర చుట్టినోడు, మహల్లో కోకిలని జనాల్లోకి తెచ్చి, పైటేసిన కిన్నెరసాని వెనక ఒక మైమరపుతో నడిపించుకు పోతాడు.. ఎక్కడికి పోయినా గోదావరిని వెంటేసుకు పోతాడు, నల్లమల ని తన చుట్టూ మొలిపించుకుంటాడు. అన్వేషణ లాంటి థ్రిల్లర్, సితార లాంటి క్లాసిక్, లేడీస్ టైలర్ లాంటి వీరకామెడీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు సినిమా మేడిన్ కోన సీమ. టాలీవుడ్ హస్య చిత్రాలలో టాప్ లిస్ట్ లో ఉండే సినిమా లేడీస్ టైలర్. రాజేంద్ర ప్రసాద్ తో చేసిన ఆ సినిమా ఇప్పటికీ తెలుగు సినిమా కలెక్షన్ లో తప్పని సరిగా ఉండే సినిమా... మరి వంశీ ఇప్పుడు మళ్ళీ ఆ లేడీస్ టైలర్ సీక్వెల్ గా మరో కథ తో మళ్ళీ వస్తున్నారు. కాలం మారిందిగా... అందుకే టైలర్, "ఫ్యాషన్ డిజైనర్" గా అప్డేట్ అయ్యాడు మరి ఈ కొత్త తరంకుర్రాడి కోనసీమ ఫ్యాషన్ డ్రెస్సులెలా ఉంటాయో తెలుసుకోవటానికే కాస్త ఆసక్తిగానే వంశీని కలిసాం... ఆ చిట్ చాట్ లో ఫిల్మీబీట్ తో ఆయన చెప్పిన మాటలు మీకోసం...

వంశీ సినిమాల్లో నే కాదు తెలుగు సినిమాకే లేడీస్ టైలర్ ఒక క్లాసిక్ సినిమాలా నిలిచి పోతుంది.. అలాంటి సినిమాకి మళ్ళీ సీక్వెల్ అనే ఆలోచన ఎలా వచ్చింది?

వంశీ సినిమాల్లో నే కాదు తెలుగు సినిమాకే లేడీస్ టైలర్ ఒక క్లాసిక్ సినిమాలా నిలిచి పోతుంది.. అలాంటి సినిమాకి మళ్ళీ సీక్వెల్ అనే ఆలోచన ఎలా వచ్చింది?

నిజానికి మొదట ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉన్నా మేం మొదట తీయాలనుకున్న కథ ఇది కాదు. మధుర శ్రీధర్‌ గారి తో కలిసి చేయాలనుకున్న కథ వేరు. చాలా వర్క్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సబ్జెక్ట్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దాని స్థానం లో ఫ్యాషన్ డిజైనర్ వచ్చాడు. అనుకోకుండా వచ్చినా అనుకున్నట్టే సినిమాని పూర్తి చేయగలిగాం...

అంటే కథ అంతకు ముందు రాసుకున్నది కాదా..??

అంటే కథ అంతకు ముందు రాసుకున్నది కాదా..??

లైన్ ఎప్పటినుంచో మనసులో ఉన్నా స్క్రిప్ట్ గా రాయలేదు. మధుర శ్రీధర్ గారు కూడా లేడీస్ టైలర్ లాంటి సినిమా ఇంకొకటి ఇవ్వండి అంటూ చెప్పారు. అలానే వర్క్ మొదలు పెట్టాం, తీరా కథ సిద్దం అయ్యాక టైటిల్ మ్యాచ్ అయ్యేలాగా... ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నాం కానీ అప్పటికే ఈ టైటిల్ వేరేవాళ్ళు రిజిస్టర్ చేసేసుకున్నారు. నాకేమో ఇది తప్ప వేరే టైటిల్ సూటవుతుందని పించలేదు. దాంతో ఇదేమాట శ్రీధర్ గారికి చెప్పటం ఆయనకీ ఇదే టైటిల్ నచ్చటం తో వాళ్ళతో మాట్లాడి టైటిల్ తెచ్చేసుకున్నాం..

టాలీవుడ్ లో సీక్వెల్స్ రిజల్ట్ ఎప్పుడూ వర్కౌట్ కాలేదు అదీ ఇన్ని సంవత్సరాల తర్వాత తీస్తున్నారు... ఈ సినిమా విషయం లో అప్పటి ఫ్లేవర్ మళ్ళీ తేగలమనే అనుకున్నారా? (బాహుబలి కూడా నిజానికి ఒకే సినిమా సీక్వెల్ కాదు లెంథ్ ఎక్కువై రెండు పార్ట్ లు చేసారు)

నాకివ్వన్నీ ఏమీ తెలియవు రీమేక్, సీక్వెల్ ఈ ఆలోచనలమీద కూడా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు పూర్తి కొత్త కథ గానే కనిపించింది. లేదంటే స్క్రిప్ట్ దశలోనే ఆపేసే వాన్ని, రిలేటెడ్ సబ్జెక్ట్ కావటం వల్ల మీకు అలా అనిపిస్తూండవచ్చు గానీ... ఫ్యాషన్ డిజైనర్ ఎవ్వరినీ నిరాశ పరచడు.., లేడీస్ టైలర్ ఫ్లేవర్ ని ఏమాత్రం తగ్గించడు.

బేసిక్ గా మీరు రైటర్ కదా... మరి సినిమా విషయానికి వచ్చేసరికి ఈ ఇద్దరి మధ్యా ఏదైనా క్లాష్ ఉంటుందా..?

బేసిక్ గా మీరు రైటర్ కదా... మరి సినిమా విషయానికి వచ్చేసరికి ఈ ఇద్దరి మధ్యా ఏదైనా క్లాష్ ఉంటుందా..?

అందుకే కదా నేను నా సినిమాల విషయం లో రైటర్ల పనిలో ఎక్కువగా కలగ జేసుకోను, నా మొత్తం సినిమాల్లో నా సొంత కథలు రెండో మూడో తప్ప అన్నీ వేరే వాళ్ళు రాసినవే. నా సినిమా అంటే నేనే రాయలనే ఆలోచన నాకేం ఉండదు... కాబట్టి నాలో రైటర్ కీ డైరెక్టర్ కీ మధ్య ఎప్పుడూ గొడవ ఉండదు.

వంశీ సినిమా అనగానే గురొచ్చేది గోదావరి, కోనసీమ ఇప్పటి వరకూ అన్ని సినిమాల్లో గోదావరి ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది... మరి ఫ్యాషన్ డిజైనర్ లో కూడా అదే ఆశించవచ్చా... ?

వంశీ సినిమా అనగానే గురొచ్చేది గోదావరి, కోనసీమ ఇప్పటి వరకూ అన్ని సినిమాల్లో గోదావరి ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది... మరి ఫ్యాషన్ డిజైనర్ లో కూడా అదే ఆశించవచ్చా... ?

నిరభ్యంతరంగా ఆశించవచ్చు... మొత్తం అంతా కనిపించేదే అది... వంశీ సినిమా ఎలా ఉంటుందీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వంద శాతం అదే అందుతుంది. పేరు ఫ్యాషన్ డిజైనర్ అని ఉన్నంత మాత్రాన గోదారిని ఎలా మిస్సవుతామండీ? మీరెదైతే ఆశిస్తున్నారో అదే అందుతుంది... మీరేదైతే కథ ఊహిస్తున్నారో దానికంటే భిన్నంగానూ ఉంటుంది. గోదావరి లేకుండా, కోనసీమ వాతావరణం లేకుండా నా సినిమా ఎలా ఉంటుంది.

 టైటిల్ ని బట్టి, మొదటి పోస్టర్ నిబట్టీ అడల్ట్ కామెడీ అయి ఉండొచ్చేమో అన్న టాక్ వచ్చింది.... మరీ...

టైటిల్ ని బట్టి, మొదటి పోస్టర్ నిబట్టీ అడల్ట్ కామెడీ అయి ఉండొచ్చేమో అన్న టాక్ వచ్చింది.... మరీ...

లేదు...! ఇప్పటివరకూ నా సినిమాల్లో కామెడీ ఉంది, వెటకారం ఉంది, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వేసుకునే సెటైర్లున్నాయి అవీ కథలో ఉన్న వాతావరణాన్ని బట్టే ఉన్నాయి, అంతే తప్ప కావాలని వల్గర్గా చూపించటం ఏమిటి. ఏ రకంగానూ బూతు ని ఎంకరేజ్ చేసేది లేదు, పల్లెలో మనుషులు వేసుకునే జోకుల్లాంటివి ఉంటే ఉండొచ్చేమో గానీ ఎక్కడా వల్గారిటీ లేదు... మొదటి పోస్టర్ వల్ల ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు.., సరే ఇప్పుడు నేను చెప్పటం ఎందుకు? సినిమా వచ్చాక మా ఫ్యాషన్ డిజైనరే చెప్పేస్తాడు...

హీరోల విషయం లో చాలానే మర్పులు జరిగినట్టున్నాయ్... అవసరాల శ్రీనివాస్ అనీ, రాజ్ తరుణ్ అనీ ఇలా కొన్ని పేర్లు వినిపించాయి ఎవ్వరూ ఉహించని విధంగా సుమంత్ అశ్విన్ తెరమీదకొచ్చాడు ఎందుకలా?

హీరోల విషయం లో చాలానే మర్పులు జరిగినట్టున్నాయ్... అవసరాల శ్రీనివాస్ అనీ, రాజ్ తరుణ్ అనీ ఇలా కొన్ని పేర్లు వినిపించాయి ఎవ్వరూ ఉహించని విధంగా సుమంత్ అశ్విన్ తెరమీదకొచ్చాడు ఎందుకలా?

లేదు ఈ వార్తలెలా వచ్చాయో గానీ అన్ని మార్పులు ఏమీ లేవు, రాజ్ తరుణ్ తో చేద్దామనుకున్న మాట నిజమే కానీ అది ఫ్యాషన్ డిజైనర్ కాదు..మొదట్లో అనుకున్న కథ లో రాజ్ అని అనుకున్నాం కానీ ఆ సబ్జెక్ట్ కుదరక పోవటం తో ఆ ప్రపోజల్ ఆగిపోయింది అంతే... ఇక అవసరాల గారిని మాత్రం సంప్రదించలేదు. నేనుకున్న క్యారెక్టర్ కి అన్ని విధాలా న్యాయం చేసాడు సుమంత్..

లేడీస్ టైలర్ లో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు

లేడీస్ టైలర్ లో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు "జ" భాష మాట్లాడతారు... మరి ఈసారి కూడా అలాంటి ప్రయోగం ఏదైనా ఉందా?

హ..హ..! ఆ సినిమాలో కూడా మొదట్లో ఆ భాష అనే అనే ఆలోచన లేదు. కథని బట్టీ హీరో అమ్మాయి శరీరం మీద ఉండే పుట్టు మచ్చ కోసం వెతకాలి.... ఆ పదాన్ని పలకాలి అయితే ఆ పదాన్ని అలాగే వాడాలనుకున్నప్పుడు పదే పదే ఆ పదం పలకటం సరికాదేమో అనిపించింది. అప్పుడు ముళ్ళపూడి గారి "క" భాష లాగా ఈ "జ" భాషలో చెప్పించారు తనికెళ్ళ భరణి గారు. ఇప్పుడు కథలో అలాంటి సందర్భం ఏమీ లేదు కాబట్టి కొత్త భాష అవసరం రాలేదు.... ఒక్క సారి మాత్రం ప్రేక్షకుల కోసం ఆ భాష లో ఒక పదాన్ని వాడించాం...

ఇక పాటల విషయనికి వస్తే మీ స్పెషల్లీ మీ సినిమాల్లొ పాటలు.. మేకింగ్ లో కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, సాహిత్యం కావచ్చు ఒక మార్క్ తో ఉంటాయి., ఎక్కువగా ఆకట్టుకుంటాయి... దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

కొన్ని పాటలు బావుంటాయి అనటాన్ని పర్సనల్ గా నేనైతే ఒప్పుకోను... నాకు అన్నీ నచ్చుతాయి...కనెక్ట్ అవుతాయి అన్న ఫీల్ వస్తుంది కాబట్టే మీవరకూ వస్తాయి. ఆ తర్వాత మాట చెప్పల్సింది మీరే అంటే ప్రేక్షకుడే., అయితే పాటలు, సంగీతం విషయం లో నేను కాదు నా సంగీత దర్శకులూ, రచయితలూ తీసుకునే శ్రద్దే అది... వాళ్ళ పని లో ఎక్కువ జోక్యం చేసుకోను...నాక్కావల్సిందేమిటో వాళ్లకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన పాటలు చూసే ఉంటారు కదా ఎలా ఉన్నాయో చెప్తూనే ఉన్నారు...

సాంగ్ మేకింగ్ కోసం కొత్త ప్రదేశాలకేమైనా వెళ్ళారా?

సాంగ్ మేకింగ్ కోసం కొత్త ప్రదేశాలకేమైనా వెళ్ళారా?

కొత్త ప్రదేశమంటే... గోదావరికంటే కొత్త ప్రదేశం వేరే ఏముటుంది. మొత్తం కోనసీమలోనే షూట్ చేసాం., ఈ మధ్యన్ కాలం లో మొత్తం పాటలు గోదావరి బ్యాక్డ్రాప్ లోనే తీసిన సినిమా రాలేదు. ప్రతీ పాటలోనూ గోదావరీ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది.

ఫ్యాషన్ డిజైనర్ అనగానే మొదటి ఆలోచన హీరోయిన్ల మీదకే వెళ్తుంది.. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి చీరలేనా లేక ఫ్రొఫెషనల్ డిజైనెర్ డ్రెస్సెస్ కూడా వాడారా?

ఫ్యాషన్ డిజైనర్ అనగానే మొదటి ఆలోచన హీరోయిన్ల మీదకే వెళ్తుంది.. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి చీరలేనా లేక ఫ్రొఫెషనల్ డిజైనెర్ డ్రెస్సెస్ కూడా వాడారా?

కాస్ట్యూమ్స్ విషయం లో ఎప్పుదూ పెద్ద రేంజ్ లో వెళ్ళలేదు కావాల్సిన చీరల షాపింగ్ నేనే చేసేవాన్ని కథా నేపథ్యాన్ని దాటి వెళ్లలేం కదా, అందుకే నాకెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ల అవసరం పడలేదు. కానీ ఈ సారి మాత్రం మొదటి సారి ఒక ఫ్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ ని ఎంచుకున్నాం. సుమ అనే డిజైనర్ ఈ సారి కొన్ని స్పెషల్ శారీస్ ని డిజైన్ చేసారు. హీరో బట్టల మీద చేసే ప్రయోగాలన్నీ ఆవిడే చూసుకున్నారు అయితే ఎక్కడా మరీ వల్గర్ అనిపించే మోడల్స్ లేవు. చీరల్లోనే గమ్మత్తుగా కనిపించే మోడల్స్ చేయించాం...

English summary
Tollywood Senior Director Vamshi known as Pasalapudi vamshi shared some information about his new project "Fashion Designer S/O Ladies Tailor" in a Interview with Filmibeat
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu