»   »  బ్రేకింగ్ న్యూస్.. బాలయ్యతో పూరి సినిమా.. 101 సినిమా వివరాలివిగో..

బ్రేకింగ్ న్యూస్.. బాలయ్యతో పూరి సినిమా.. 101 సినిమా వివరాలివిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శతచిత్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారైంది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

 బాలయ్య నోట పూరీ పంచ్ డైలాగ్స్

బాలయ్య నోట పూరీ పంచ్ డైలాగ్స్


పవర్‌ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్‌ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్‌ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్‌ మీల్స్‌ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ సినిమా వివరాలను ప్రకటించారు.

 బాలయ్య హీరోగా ..రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌

బాలయ్య హీరోగా ..రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌


‘‘రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణ హీరోగా భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను'' అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో పూరీ చిత్రాలకు ఓ బ్రాండ్ ఉంది. ఆయన రాసే సంభాషణలు సామాన్యులను కూడా ఆకట్టుకొంటాయి.

 బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ అరుదైన కాంబినేషన్‌

బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ అరుదైన కాంబినేషన్‌


‘బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. బాలకృష్ణగారి పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌గారిలో పెన్‌ పవర్‌కీ, ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తాం' అని నిర్మాత వీ ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు.

 చాలా కొత్తగా బాలకృష్ణ సినిమా

చాలా కొత్తగా బాలకృష్ణ సినిమా


‘బాలకృష్ణ కెరీర్‌లోనే ఇంతకుముందు ఉండని విధంగా చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిస్తాం. షూటింగ్‌ కూడా ఆ రోజే మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో కథానాయికలు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, మిగతా వివరాలను ప్రకటిస్తాం' అని ఆయన అన్నారు.

English summary
Balakrishana 101 movie announcement comes officially, Puri Jagannadh is the director. Producer V Anand Prasad revealed details of Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu