twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు బాలీవుడ్ లో నిజ జీవిత కథలను తెరకెక్కించే ట్రెండ్ మొదలయ్యింది. అప్పటికే పాపులర్ అయిన వ్యక్తుల జీవిత చరిత్రలను తెరకెక్కించటం ద్వారా రిలీజ్ కు ముందే కొందరు ఆడియన్స్ ని ప్రిపేర్ చేయవచ్చనే స్ట్రాటజీతో ఈ చిత్రాలు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఈ తరహా కథలే వినిపిస్తున్నాయి. ఒకరకంగా ఈ తరహా చిత్రాలకు డర్టీ పిక్చర్ ప్రాణం పోసిందనే చెప్పాలి.

    బాలీవుడ్‌ పరిశ్రమ ఇప్పుడు సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. నిజ జీవితంలో సంచలనాలు సృష్టించిన వ్యక్తుల జీవిత చరిత్రను, వాళ్ల విలక్షణ జీవితాన్ని వెండి తెరకు పరిచయం చేయనుంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జీవిత చరిత్రను తెరపైకెక్కించగా ఫ్రాన్స్‌కు చెందిన నటి మోనికా బెల్లూచి తెరపై నటించింది.

    2007లో విడుదలకు సిద్ధమైనా ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినా ఆ పంథా కొనసాగుతూనే ఉంది. దక్షిణ భారత సినిమా ప్రపంచంలో శృంగార నృత్య తారగా ఓ వెలుగు వెలిగిన సిల్క్‌స్మిత జీవితగాధ తెరకెక్కి విద్యాబాలన్‌కు ఈ చిత్రం ఎన్నో అవార్డులు, మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం విదితమే. ఇదే తరహాలో మరికొందరు దర్శక, నిర్మాతలు, నటీనటులు నిజ జీవితగాథను తెరపై పండిచేందుకు ఎవరి పద్దతిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    అక్షయ్‌ కుమార్‌: దావూద్‌ ఇబ్రహీం తెరపై కనిపించనున్నాడు. ఏక్తా కపూర్‌ నిర్మించనున్న 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయి-2', 'డర్టీ పిక్చర్‌' దర్శకుడు మిలన్‌ లూత్రియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ వివాదం, 1993లో జరిగిన ముంబయి పేలుళ్లలో దావూద్‌ ప్రధాన నిందితుడు. గతంలో 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి' చిత్రంలో దావూద్‌పాత్రను నటుడు సోనుసూద్‌ పోషించాడు. ప్రస్తుతం 'స్పెషల్‌ 26' చిత్రంలో నకిలీ సీబీఐ పాత్రలో అకట్టుకున్న అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు దావూద్‌ పాత్రలో ఎలా కనిపించనున్నాడో చూడాలి.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    ప్రియాంకా చోప్రా: బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని పాత్రను ప్రియాంకా పోషించనుంది. బాక్సర్‌గా ఒలింపిక్స్‌లో మహిళా విభగంలో దేశానికి పతకం సాధించిన మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల మేరీకోం జీవితగాధను 'మేరీకోం బయోపిక్‌' పేరుతో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సారీ తెరకెక్కించనున్నాడు. మేరీ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. పెళ్లయిన తరువాత జరిగిన సంఘటనలు, ఒలింపిక్స్‌ ప్రయాణం ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    రణబీర్‌ కపూర్‌: 1970, 1980లో ఎన్నో సూపర్‌ హిట్‌ గీతాలను అలపించిన సింగర్‌ కిషోర్‌ కుమార్‌ పాత్రను రణబీర్‌ కపూర్‌ పోషించనున్నాడు. తన తండ్రి రిషీ కపూర్‌కి 'బచ్నా ఏ హసీనో' అనే గీతం అప్పట్లో ఎంతో హిట్‌ అయ్యిందని, ఆపాట పాడిన సింగర్‌ పాత్రను పోషించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పుడు కూడా తాను నటించే చిత్రంలో తాను ఆ గీతాన్ని అలపించనున్నట్లు రణబీర్‌ తెలిపాడు. ఇప్పటికే సింగర్‌గా రాక్‌స్టార్‌ చిత్రంతో అలరించిన రణబీర్‌ కిషోర్‌ కుమార్‌గా ఎలా కనువిందు చేయనున్నాడో చూడాలి.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    విద్యా బాలన్‌: 'ది డర్టీ పిక్చర్‌', 'కహానీ' చిత్రాలలో హీరోతో సంబంధం లేకుండానే తన నటనతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నటి విద్యా బాలన్‌. సింగర్‌గా వేలాది పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్‌.ఎస్‌.సుబ్బలక్ష్మి పాత్రలో విద్యా కనిపించనుంది. మద్రాసుకు చెందిన సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఇటు బాలీవుడ్‌, అటు దక్షిణాది ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని అందరూ ఎంతో అసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    మాధురీ దీక్షిత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహిళ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం పోరాడతూ గులాబీ గ్యాంగ్‌ను స్థాపించిన సంపత్‌పాల్‌ జీవనశైలిని సౌమిక్‌ సేన్‌ మాధురీ దీక్షిత్‌తో తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించిన దర్శకుడిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తన అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సంపత్‌పాల్‌ విమర్శలు చేసింది. ఎన్నో వివాదాలతో కూడిన ఒక వ్యక్తి జీవిత చరిత్రను దర్శకుడు ఎలా తెరకెక్కించనున్నాడో, ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నాడో.

    2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

    మల్లికా శరావత్‌: శృంగార తారగా పేరు తెచ్చుకున్న ఈనటి ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఒక పాత్రను చెయ్యనుంది. 1992 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో భన్వరి దేవి అనే మహిళపై అయిదుగురు దుండగులు కిరాతకంగా నడి రోడ్డుపై జరిపిన సామూహిక అత్యాచారం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అత్యాచారానికి గురైన మహిళ పట్ల సమాజం స్పందన ఎలా ఉంటుంది.. సమాజాన్ని జయించి జీవితాన్ని తన కుటుంబ సభ్యులతో ఎలా సాగిస్తుంది అనే కథాంశంతో తెరకెక్కించే ఈ చిత్రంలో పాత్రకు మల్లికా ఎంతవరకు న్యాయం చెయ్యగలదో చూడాలి మరి. శృంగార తారగా పేరు తెచ్చుకున్నా ఈ భామ ఇందులో పూర్తిస్థాయి గృహిణిగా ఎలా మెప్పించనుందో అనే విషయం ఇప్పుడు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    English summary
    Bollywood does not venture much into the territory of biopics but the success of movies like Chak De India and The Dirty Picture is inspiring filmmakers to bring interesting life-stories on the big screen. Take a look!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X