»   » ప్చ్...తండ్రి స్టార్ హీరో, అయినా ఆమెకు లైంగిక వేధింపులు తప్పలేదు

ప్చ్...తండ్రి స్టార్ హీరో, అయినా ఆమెకు లైంగిక వేధింపులు తప్పలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

: బాలీవుడ్ న‌టి, ప్ర‌ముఖ న‌టుడు అనిల్‌క‌పూర్ కుమార్తె అయిన సోన‌మ్ క‌పూర్ రీసెంట్ గా ఓ టీవీ షోలో త‌న‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. బాలీవుడ్ లో ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మ‌న్స‌ద్ షోలో సోన‌మ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ షో ఇంకా ప్రసారం కాక‌పోయినా.. దీనికి సంబంధించిన ప్రోమోను స‌ద‌రు చానెల్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.


ఈ షోలో మాట్లాడుతూ...చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ అన్నారు. అనుష్క శర్మ, విద్యాబాలన్‌, రాధికా ఆప్టే, ఆలియాభట్‌లతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సోనమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.
Sonam Kapoor

ఈ సమావేశంలో సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌తో సోనమ్‌ మాట్లాడుతూ.. 'నాకు తెలుసు. చిన్నవయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది' అన్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తైన ఆమె ఈ మాట అనడంతో ఆ చర్చలో పాల్గొన్నవారే కాక చిత్ర పరిశ్రమ, ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

2016 సంవత్సరంలో బాలీవుడ్‌లో తమ నటనా సామర్థ్యంతో మంచి విజయాలు సాధించిన నటీమణులతో రాజీవ్‌ మసంద్‌ ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలా తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా మిగిలిన మహిళల్లో చైతన్యం కలుగుతుందనే ఈ అంశాన్ని చర్చించినట్లు వారు పేర్కొన్నారు.

English summary
Sonam Kapoor got candid during a recent interview and admitted that she was molested as a child.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu